Vivo బ్రాండ్ చైనీస్ మార్కెట్లో Vivo Y300 Pro స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా లాంచ్ చేసింది.

మొత్తం నాలుగు వేరియంట్లలో లాంచ్ అయింది. అందులో Vivo Y300 Pro బేస్ 8GB + 128GB వేరియంట్ CNY 1799 (సుమారుగా రూ.21,000)గా ఉంది.

మిడ్ రేంజ్ 8GB + 256GB వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ. 23,000) గా ఉంది.

ఆ తర్వాత రేంజ్ 12GB + 256GB వేరియంట్ ధర CNY 2,199 (సుమారు రూ. 26,000) ఉంది.

దీని టాప్ ఎండ్ హై 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,499 (దాదాపు రూ. 29,000)గా కంపెనీ నిర్ణయించింది.

ఇది బ్లాక్ జేడ్, గోల్డ్ విత్ జేడ్, వైట్, టైటానియం వంటి కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేయబడింది.

ఈ ఫోన్ 6.77-అంగుళాల (2392 x 1080 పిక్సెల్‌లు) 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఇది గరిష్టంగా 5000 nits గరిష్ట ప్రకాశం, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

ఇది Qualcomm Snapdragon 6 Gen 1 SoCతో పాటు 12GB వరకు RAM + 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను పొందుతుంది.

ఇందులో 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.