EPAPER

Kirrak Couples: బిగ్ టీవీలో స్పెషల్ షో మొదలు.. ‘కిర్రాక్ కపుల్స్’ అంటూ బుల్లితెర జోడీలతో రామ్‌ప్రసాద్ సందడి

Kirrak Couples: బిగ్ టీవీలో స్పెషల్ షో మొదలు.. ‘కిర్రాక్ కపుల్స్’ అంటూ బుల్లితెర జోడీలతో రామ్‌ప్రసాద్ సందడి

Kirrak Couples On Big TV: బిగ్ టీవీలో న్యూస్ మాత్రమే కాదు ఎంటర్‌టైన్మెంట్ కూడా పక్కా అని చెప్పడం కోసం బుల్లితెర జోడీలతో ఒక స్పెషల్ షో ప్రారంభమయ్యింది. అదే ‘కిర్రాక్ కపుల్స్’. ఒక కొత్త షో ప్రారంభించడానికి వినాయక చవితిలాంటి పండగ మంచిదని ఈ పండగ రోజున ఈ షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ రిలీజ్ చేశారు. ‘కిర్రాక్ కపుల్స్’లో బుల్లితెరకు సంబంధించిన రియల్‌తో పాటు రీల్ కపుల్స్ కూడా వచ్చి కామెడి స్కిట్స్‌తో, గేమ్స్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు. అలా మొదటి ఎపిసోడ్‌లో ఒక రియల్ కపుల్‌తో పాటు ఇద్దరు రీల్ కపుల్స్ వచ్చి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్.. బిగ్ టీవీ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది.


ఆరేళ్ల ప్రేమకథ

‘జబర్దస్త్’ ఫేమ్ ఆటో రామ్ ప్రసాద్‌తో పాటు షార్ట్ ఫిల్మ్స్‌తో పాపులర్ అయిన భ్రమరాంబిక.. ‘కిర్రాక్ కపుల్స్’ షోకు యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. షోలోకి వచ్చిన ఆడవారికి చీరలు ఇచ్చి ఆహ్వానించారు. ఒక రీల్ కపుల్, ఒక రియల్ కపుల్‌ షోకు గెస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. అలాగే మూడో కపుల్‌గా సీరియల్ ఆర్టిస్ట్ సుమిత్.. దివ్య అనే మరో సీరియల్ ఆర్టిస్ట్‌తో కలిసి వచ్చాడు. మీరు ఎలాంటి కపుల్ అని వారిని అడగగా.. ‘‘మేము రేవ్ కపుల్’’ అంటూ తన స్టైల్‌లో సమాధానమిచ్చాడు సుమిత్. పైగా భ్రమరాంబికను చూసి రోడ్డు మీద తిరిగే ట్యాంకర్‌లాగా ఉందని జోకులు వేశాడు. ఇక షోలోకి వచ్చిన రియల్ కపుల్ ప్రియా, హృతేష్‌ను తమ లవ్ స్టోరీ అడిగి తెలుసుకున్నారు. లవ్ మ్యారేజ్ కాబట్టే తన గుండె ఇంకా కొట్టుకుంటుంది అంటూ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు హృతేష్.


Also Read: మత్తు వదిలించిన ట్రైలర్.. మామూలుగా లేదు భయ్యా

కూల్ భార్య

రీల్ కపుల్‌గా వచ్చిన సౌజన్య, బాజీ కలిసి ఒక కామెడీ స్కిట్ చేశారు. అందులో బాజీకి సౌజన్యతో పాటు భ్రమరాంబిక కూడా భార్యగా నటించింది. వారంతా ఒక సీరియల్‌లో నటిస్తున్నట్టుగా, ఆ సీరియల్ డైరెక్టర్ రామ్ ప్రసాద్‌గా ఈ స్కిట్‌లో పాల్గొన్నారు. అసలు సీరియల్‌లో ఆర్టిస్టుల యాక్టింగ్ ఎలా ఉంటుందో క్లియర్‌గా చూపించారు సౌజన్య. ఇక బాజీ భార్య కూడా కాసేపు షోలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. గతంలో బాజీ లవ్ స్టోరీల గురించి చాలా మామూలుగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘‘మా ఆయన ఎవరికీ ఐ లవ్ యూ చెప్పడు, కావాలంటే గర్ల్‌ఫ్రెండ్‌గా ఉంటావా అని అడుగుతాడు. అలా చేయడంలో నాకేం ప్రాబ్లమ్ లేదు’’ అని కూల్‌గా సమాధానమిచ్చారు.

ఆ ఇద్దరి మధ్య గొడవ

‘కిర్రాక్ కపుల్స్’ ఫస్ట్ ఎపిసోడ్ అంతా సరదాగా సాగిపోతుండగా.. సుమిత్, భ్రమరాంబిక మధ్య జరిగిన గొడవ మాత్రం అందరినీ డిస్టర్బ్ చేసింది. ముందుగా రామ్ ప్రసాద్, భ్రమరాంబిక, సుమిత్, దివ్య కలిసి ఒక స్కిట్‌ను ప్రారంభించారు. ఆ స్కిట్ జరుగుతున్న సమయంలో సుమిత్ క్యారెక్టర్ వేస్ట్ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది భ్రమరాంబిక. దానికి సుమిత్ హర్ట్ అయ్యాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలయ్యింది. మధ్యలో భ్రమరాంబిక స్టేజ్ దిగి వెళ్లిపోయింది. ఇదంతా తాను కావాలనే చేశానని భ్రమరాంబికకు సారీ చెప్పి మళ్లీ స్టేజ్‌పైకి తీసుకొచ్చాడు సుమిత్. అలా ముగ్గురు కపుల్స్‌తో ‘కిర్రాక్ కపుల్స్’ ఫస్ట్ ఎపిసోడ్ చాలా సరదాగా సాగిపోయింది. ప్రతీ శనివారం రాత్రి 7 గంటలకు బిగ్ టీవీలో ‘కిర్రాక్ కపుల్స్’ ప్రసారమవుతుంది.

Related News

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Pawan Kalyan : నిర్మాతలకు పవన్ కళ్యాణ్ షాక్.. ఇలా చేస్తారని అనుకోలేదు డిప్యూటీ సీఏం సార్..

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Pushpa 2 : అక్టోబరే డెడ్ లైన్… ఇక చరణ్ తో తాడో పేడో..

Game Changer: అల్లు అర్జున్ తో పోటీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?

Niharika Konidela: తమిళ తంబీల మనసు దోచేస్తున్న నిహారిక.. డ్యాన్స్, రొమాన్స్ అదరగొట్టేసిందిగా!

Big Stories

×