విటమిన్ ‘డి’ రిచ్ ఫుడ్ ఇదే!

విటమిన్ 'డి' మన శరీర పనితీరు పెంచడానికి అనేక విధాలుగా సాయపడుతుంది.

విటమిన్ 'డి' ఎముకల బలానికి అవసరమైన భాగం. ఇది దంతాలు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని కాపాడుకోవడంలో విటమిన్ 'డి' పెద్ద పాత్ర పోషించడంతోపాటు ఇమ్యూనిటీ పెంచుతుంది.

సాల్మన్ చేపల్లో డి విటమిన్‌ అధికంగా ఉంటుంది. మన దేశంలో అరుదుగా దొరుకుతాయి. సముద్ర జలాల్లో దొరికే సాల్మన్ చేపల్లో విటమిన్స్ మెండుగా ఉంటాయి.

పుట్టగొడుగులు సూర్యకాంతిలో పెరుగుతాయి కాబట్టి, వాటిలో విటమిన్ 'డి'  పుష్కలంగా ఉంటుంది.

కాడ్‌ లివర్‌ ఆయిల్‌... ఇది పోషకాలతో కూడిన చేపనూనె. ఈ ఆయిల్‌ సప్లిమెంట్లలో విటమిన్ 'డి' , ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి.

గుడ్డు పచ్చసొన మరింత పోషకమైంది. ఇందులో విటమిన్ 'డి' ఉంటుంది. తెల్లసొనతో పోలిస్తే గుడ్డు పచ్చసొనలో ఫోలేట్, విటమిన్లు  పుష్కలంగా ఉన్నాయి.

సోయాబీన్‌లతో చేసే సోయాపాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి మొక్కల ఆధారిత పాలు. ఇందులో అధిక విటమిన్ 'డి' ను కలిగి ఉంటాయి.