EPAPER

Typhoon Yagi Wreaks: చైనాలో యాగీ తుఫాను బీభత్సం.. నేల కూలిన బిల్డింగులు, ఎగిరిపోయిన వాహనాలు

Typhoon Yagi Wreaks: చైనాలో యాగీ తుఫాను బీభత్సం.. నేల కూలిన బిల్డింగులు, ఎగిరిపోయిన వాహనాలు

Two killed, 92 injured as super Typhoon Yagi wreaks havoc in China’s Hainan: చైనాలో యాగీ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో దక్షిణ చైనాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ ఎఫెక్ట్ ఫిలిప్పీన్స్ దేశాలను కూడా తాకింది. చైనాలోని హైనాన్, గ్వాంగ్‌డాంగ్, గ్వాంగ్జి జువాంగ్ స్వయం ప్రతిపత్త ప్రాంతాల్లో 12 లక్షల మంది ప్రజలు తుఫాను కారణంగా ప్రభావితమయ్యారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెలికాం సేవలకు అంతరాయం ఏర్పడింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా తుఫాన్ అక్కడ విధ్వంసం సృష్టించింది. ఇప్పటికే ఇద్దరు మరణించగా… 92 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో చైనా వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.


తుఫాన్ గాలికి వాహనాలు ఎగిరిపోయాయి. బిల్డింగులు నేల కూలాయి. చైనాలో రోడ్లు, వంతెనలు, ఆనకట్టలు ధ్వంసం అయ్యాయి. ముందు జాగ్రత్తగా అధికారులు విద్యాసంస్థలు, ఆఫీసులు మూసేశారు. రైలు, 100కు పైగా విమాన సర్వీలసు రద్దు చేశారు. యుద్ధం తర్వాత ద్వంసమైన వీధుల్లా చైనాలోని పలు నగరాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఊడిపడనిన బోర్డింగులు, ధ్వంసమైన బిల్డింగుల పైకప్పులు, బోల్తాపడిన వాహనాలే కనిపిస్తున్నాయి. హైనాన్‌లో గంటకు 245 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో ముంపు ప్రభావిత ప్రాంతాల నుండి 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Also Read: స్కూల్ బాత్రూంలో కాల్పులు.. బాలుడు మృతి


చైనా నుంచి ఈ తుఫాన్ ఫిలిప్పైన్స్ కు చేరకుంది. అక్కడ కూడా పెను విధ్వంసమే జరిగింది. సముద్రంలోని ఓడలు, పడవలు కొట్టుకుపోయాయి. హైనాన్‌లో 1949 నుంచి 2023 వరకు 106 తుఫాన్లు వచ్చాయి. కానీ.. అందులో తొమ్మిది మాత్రమే సూపర్ టైఫూన్‌లుగా గుర్తించారు వాతావరణ శాఖ అధికారులు. వాటిన్నింటిలో ఇదే ప్రమాదకరమైనదని ఓ అంచనా.

Related News

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Longest working hours: ఈ దేశాలకి వెళ్లే అవకాశం వచ్చినా వెళ్ళకండి.. అత్యధిక పని గంటలు ఉన్న దేశాలు ఇవే..

Big Stories

×