పిల్లల శరీరానికి అవసరమైన పోషకాలు అందక పోతే వయస్సుకు తగ్గ బరువు పెరగరు.

దీని వల్ల తరుచుగా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అందుకే పిల్లలు వయస్సుకు తగినంత బరువు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

పిల్లలు బరువు పెరగడం కోసం వారి డైట్‌‌లో పోషక పదార్థాలను చేర్చాలి.

స్కూల్‌కు వెళ్లే సమయంలోనే వారు శారీరకంగా, మానసికంగా ఎదుగుతారు.

పిల్లలకు టిఫిన్‌గా ఇడ్లీ, దోశలు పెడుతున్నట్లయితే వాటిలో క్యారెట్ తురుము, బఠానీలను వాడితే మంచిది.

పిల్లలకు టిఫిన్‌లో డైలీ పాలు, గుడ్లు ఇవ్వడం మంచిది. ప్రతీ రోజు ఒక్కో రకమైన సీజనల్ ఫూట్స్ కూడా ఇవ్వండి.

మధ్యాహ్న భోజనంలో భాగంగా చపాతీ లేదా మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ,కిచిడి వంటివి పెడితే మంచిది.

సాయంత్రం పూట ఫ్రూట్ మిల్క్ షేక్ ఇవ్వడం ద్వారా వారి శరీరానికి సరైన పోషకాలు అందుతాయి.

పిల్లలకు రాత్రి భోజనంలో కూరగాయలతో పాటు పప్పు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.