EPAPER

RTC Bus: బస్సు ఆపి పారిపోయిన యువకుడు.. సజ్జనార్ ట్వీట్

RTC Bus: బస్సు ఆపి పారిపోయిన యువకుడు.. సజ్జనార్ ట్వీట్

TGSRTC: సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు పోకిరీలు పిచ్చి చేష్టలు చేస్తున్నారు. లైక్‌ల కోసం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇంకొందరు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఓ యువకుడు సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఓ ఆర్టీసీ బస్సును ఆపి.. బస్సు ఆగాక పరుగులు పెట్టాడు. ఈ వీడియో వైరల్ అవుతున్నది. దీనిపై టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు.


బస్సు ఆపి పరుగెట్టు బ్రో.. అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు వీడియోలో ఉన్న యువకుడు చెప్పాడు. ఆ తర్వాత రోడ్డు మీదికి వెళ్లి అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సుకు చేతిని అడ్డం పెట్టాడు. నిజంగానే ప్రయాణికుడనుకుని ఆ బస్సు డ్రైవర్ బస్సు ఆపేశాడు. ఆ పోకిరీ బస్సు దగ్గరికి వచ్చాక.. బస్సు ఎక్కినట్టు చేసి.. దిగి వెంటనే పరుగు తీశాడు. కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం బస్సును ఆపి పరుగులు పెట్టాడు. బస్సులోని ప్రయాణికులకు అవాంతరాన్ని కలిగించాడు.

ఆ వీడియో టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కంటపడింది. ఆయన వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియాలో పేర్కొంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా? అంటూ నిలదీశారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే కామన్ సెన్స్ కూడా లేదని మండిపడ్డారు. ఇలా చేసి కొందరు వికృతానందం పొందుతున్నారని ఆగ్రహించారు.


Also Read: Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

లైకులు, కామెంట్ల కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయడం మానుకోవాలని హితవు పలికారు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. బంగారు భవిష్యత్ వైపునకు బాటలు వేసి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని సూచించారు.

ఆ బస్సుపై ఏపీఎస్ఆర్టీసీ అని రాసి ఉన్నది. అది ఏపీ బస్సు అని అర్థమవుతున్నది. అందుకే టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అదే ట్వీట్‌లో ఏపీ పోలీసులను ట్యాగ్ చేశారు. ఇకనైనా ఇలాంటి పనులు, వెర్రి చేష్టలు ఆపేయాలని నెటిజన్లు బుద్ధిచెప్పారు. లోపలేసి నాలుగు దెబ్బలు తగిలిస్తే దారికొస్తారు అంటూ మరొకరు రియాక్ట్ అయ్యాడు. మనకు కూడా లైక్స్ రీచ్ కావాలని, కేసు కట్టి.. వాడిని లోపలేసి వీడియో పెట్టాలని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు.

ఈ ట్వీట్ కంటే ముందు ఎండీ వీసీ సజ్జనార్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వినాయక చవితిని పర్యావరణ హితంగా జరుపుకుందామని పేర్కొన్నారు.

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×