EPAPER

Devara Trailer: పండగ సందర్భంగా ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Devara Trailer: పండగ సందర్భంగా ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Devara Trailer Release Date: ప్రస్తుతం తెలుగులోని స్టార్ హీరోలంతా తమ అప్‌కమింగ్ సినిమాల్లో బిజీగా గడిపేస్తున్నారు. ముఖ్యంగా టాప్ స్థానాల్లో ఉన్న హీరోల సినిమాలు వరుసగా పోస్ట్‌పోన్ అవుతూ ఉండడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. అందుకే అలా పలుమార్లు పోస్ట్‌పోన్ అయ్యి ఈ ఏడాది చివర్లో విడుదలకు సిద్ధమయిన చిత్రాలు మరోసారి వాయిదా పడకుండా మేకర్స్ జాగ్రత్తపడుతున్నారు. అలాంటి సినిమాల్లో ఎన్‌టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ కూడా ఒకటి. ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధమయిన ‘దేవర’.. ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు చేసుకుంది. తాజాగా ఎన్‌టీఆర్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశాడు.


ప్రమోషన్స్ ప్రారంభం

వినాయక చవితి సందర్భంగా చాలామంది సినీ సెలబ్రిటీలు తమ అప్‌కమింగ్ సినిమాల గురించి అప్డేట్స్ ఇవ్వడం కామన్. అందులో ముందుగా ఎన్‌టీఆర్.. తన అప్‌కమింగ్ మూవీ ‘దేవర’ ట్రైలర్ అప్డేట్‌తో ఫ్యాన్స్‌ను సంతోషపెట్టాడు. ఫ్యాన్స్ అంతా వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూనే ‘దేవర’ ట్రైలర్ సెప్టెంబర్ 10న విడుదల అవుతుందని ప్రకటించాడు. పండగ రోజున ఈ అప్డేట్ ఎన్‌టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ హ్యాపీనెస్ ఇస్తుంది. ‘దేవర’ సక్సెస్ అవ్వాలని చాలామంది ప్రేక్షకులు ఎన్‌టీఆర్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పడం మొదలుపెట్టారు. ట్రైలర్ రిలీజ్‌తో ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మరింత స్పీడ్ పెరగనుందని తెలుస్తోంది.


Also Read: బాలయ్యకు విలన్ గా స్టార్ హీరో.. జనాలను చంపేద్దామనుకుంటున్నారా.. ?

హిట్ కాంబినేషన్

ఇప్పటికే ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ హిట్‌గా నిలిచింది. అందుకే ‘దేవర’పై కూడా ఆడియన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ‘ఆచార్య’ తప్పా కొరటాల శివ కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ‘ఆచార్య’తో ఫార్మ్ కోల్పోయినా కూడా కొరటాల శివ మీద నమ్మకంతో ‘దేవర’ ప్రాజెక్ట్‌ను ఓకే చేశాడు ఎన్‌టీఆర్. పైగా ఎన్నో ప్యాన్ ఇండియా సినిమాలలాగానే ‘దేవర’ కూడా రెండు పార్ట్స్‌గా విడుదల కానుందని కొరటాల శివ స్వయంగా ప్రకటించాడు. ఈ మూవీ పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధమయ్యింది.

కెమిస్ట్రీ అదుర్స్

అసలైతే ‘దేవర’ 2024 సమ్మర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ సినిమా ఔట్‌పుట్ బాగుండాలంటే మరికొస్త సమయం తీసుకోక తప్పదని దీనిని ఏకంగా అక్టోబర్‌కు పోస్ట్‌పోన్ చేశాడు. మళ్లీ ఏమైందో తెలియదు అక్టోబర్‌లో కాకుండా సెప్టెంబర్ 27నే ‘దేవర’ విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. అనుకున్నదానికంటే నెలరోజుల ముందే విడుదల అవుతుండడంతో ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ కూడా ఖుషీ అయ్యారు. ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. టాలీవుడ్‌లో డెబ్యూకు సిద్ధమయ్యింది. ఇప్పటికే ‘దేవర’ నుండి రెండు డ్యూయెట్ సాంగ్స్ విడుదల అవ్వగా అందులో ఎన్‌టీఆర్, జాన్వీ కపూర్ కెమిస్ట్రీ చాలా బాగుందని ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. ‘దేవర’కు సంగీతాన్ని అందించాడు.

Related News

Game Changer: అల్లు అర్జున్ తో పోటీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?

Niharika Konidela: తమిళ తంబీల మనసు దోచేస్తున్న నిహారిక.. డ్యాన్స్, రొమాన్స్ అదరగొట్టేసిందిగా!

Naga Chaithanya – Sobhitha Dulipala : సీక్రెట్ గా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్న చై – శోభిత.. ఇదేం ట్విస్ట్ బాబు..

Comedian Ali: పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలీ..

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ వీక్‌నెస్ అదే, అక్షయ్ కుమార్‌కు అలా చెప్తేనే వింటాడు.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

Adithi Rao – Siddarth : అప్పుడే భర్తకు చుక్కలు చూపిస్తున్న అదితి.. కన్నీళ్లు పెట్టుకున్న సిద్దార్థ్..

Big Stories

×