EPAPER

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

No Doctors For Jails| మధ్యప్రదేశ్ లోని జైళ్లలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో జైళ్లలో ఉన్న ఖైదీలు.. ఆరోగ్య సమస్యలతో బాధపడుతండగా.. వారికి సమయానికి వైద్య చికిత్స అందడం లేదు. మధ్య ప్రదేశ్ లోని మొత్తం వైద్యుల ఉద్యోగాల్లో 72.4 శాతం ఖాళీ ఉన్నాయి. అలాగే వైద్య సిబ్బంది ఉద్యోగాలు 47.4 శాతం ఖాళీగా ఉన్నాయి.


ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వైద్యుల కొరత ఉండడంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యులు ఎక్కువ పనిగంటల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. గణాంకాలు చూస్తే.. జైళ్లలో ఉన్న 5625 ఖైదీలకు ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నారు. కానీ నియమాల ప్రకారం.. ప్రతీ 300 ఖైదీలకు ఒక డాక్టర్ ఉండాలి.

వైద్యుల కొరత ఒకవైపు ఉండగా.. జైళ్లలో ఉంచాల్సిన ఖైదీల కంటే రెండింతల సంఖ్యలో ఖైదీలను అధికారులు చొచ్చుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న జైళ్లలో గరిష్టంగా 28000 మంది ఖైదీలను ఉంచాలి. కానీ ప్రస్తుతం అధికారిక గణాంకాల ప్రకారం.. 45000 మంది ఖైదీలున్నారు.


Also Read: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

దీని వల్ల ప్రతీ సంవత్సరం వందకుపైగా ఖైదీలు చనిపోతున్నారు. 2022లో 130 ఖైదీలు చనిపోగా.. వీరిలో అయిదు మంది మాత్రమే వృద్ధాప్యం కారణంగా మరణించారు. మిగతా 125 మంది ఖైదీలు అనారోగ్యం బారిన పడి వైద్యం అందక ప్రాణాలు వదిలారు.

తొమ్మిదేళ్ల క్రితం మోహిసిన్ అనే యువకుడా చైన్ స్నాచింగ్ దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ తరువాత అతడిని పోలీసులు తీవ్రంగా టార్చర్ చేసి అనంతరం భోపాల్ జైలుకు తరలించారు. అక్కడ సరైన వైద్యం అందక మోహిసిన్ మరణించాడు. ఈ ఘటనపై అతడి తల్లి కోర్టును ఆశ్రయించింది. మొహిసిన్ కు పోలీసులు కరెంట్ షాక్ ఇచ్చారని, పైకిందులు వేలాడదీసి విపరీతంగా కొట్టారని తెలిపింది. ఈ కేసులో కోర్టు.. నిందితులైన పోలీసులను సస్పెండ్ చేసింది.

అయినా ఇలాంటి ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. జూన్ 2024లో జబల్ పూర్ సెంట్రల్ జైలులోని ముగ్గురు ఖైదీలు వైద్యం అందక అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. దీనిపై జైలు శాఖ డిజీపి గోవింద్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. జైళ్లల్లో ఖైదీలకు వైద్యం అందించేందుకు 58 మంది వైద్యులు అవసరం ఉండగా.. 50 శాతం వైద్యుల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కేవలం 8 మంది డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారని.. ఈ విషయం ప్రభుత్వానికి ఏడు నెలల క్రితమే తెలిపినా ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని చెప్పారు.

Also Read: Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

ఈ అంశంపై రాష్ర మంత్రి, జైళ్ల సంస్కరణ కమిటీ చైర్మన్ నరేంద్ర శివాజీ పటేల్ స్పందించారు. జిల్లా జైళ్లలో మంచి వైద్య సదుపాయాలున్నాయని.. ఖైదీకి తీవ్ర అనారోగ్యమైతే బయట ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అనుమతులున్నాయని కంటి తుడుపు వ్యాఖ్యాలు చేశారు. త్వరలోనే జైళ్ల కోటాలో వైద్యలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. కానీ ఎంత సమయంలోగా చేస్తారనే విషయం చెప్పలేదు.

Related News

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Bangladesh Riots: వేరే లెవల్ మాఫియా ఇదీ.. తలదాచుకుందామని వస్తే.. వ్యభిచారంలోకి

Big Stories

×