EPAPER

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Paralympics Hokato Hotozhe| ఒలింపిక్స్ లో జరగని అద్భుతాలు భారత దేశం కోసం పారాలింపిక్స్ లో జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి (సెప్టెంబర్ 6, 2024)న పారిస్ పారాలింపిక్స్ పోటీల్లో ఇండియా ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. లాంగ్ జంప్ పోటీల్లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ బంగారు పతకం సాధించగా.. షాట్ పుట్ పోటీల్లో మాజీ ఆర్మీ ఆఫీసర్ హొకాటో హోటోజె సెమా కాంస్య పతకం సాధించారు.


లాంగ్ జంప్ పోటీల్లో ప్రవీణ్ కుమార్ ఒక సూపర్ జంప్ చేశాడు. ఏషియన్ గేమ్స్ లో తను సాధించిన రికార్డ్ ని తనే బద్దలు కొట్టాడు. పారిస్ పారాలింపిక్స్ లో హై జంప్ పోటీల్లో ఆరుగురు అథ్లెట్లతో పోటీ పడుతూ 2.08 మీటర్ల బెస్ట్ జంప్ చేసి ప్రవీణ్ కుమార్ కొత్త రికార్డ్ ని సృష్టించాడు. పోడియంలో టాప్ పొజిషన్ ని కైవసం చేసుకున్నాడు. పుట్టుకతో ఒక కాలు చిన్నగా ఉన్న ప్రవీణ్ కుమార్ పారిస్ పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు.

మరోవైపు భారత్ మాజీ ఆర్మీ ఆఫీసర్ హొకాటో హోటోజె సెమా షాట్ పుట్ త్రో పోటీల్లో 14.65 మీటర్ల్ బెస్ట్ త్రో చేశాడు. F57 క్లాస్ షాట్ పుట్ పోటీల్లో సెమా మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. ఈ రెండు పతకాలతో భారత్ సాధించిన మొత్తం మెడల్స్ సంఖ్య 27 కు చేరింది.


పారాలింపిక్స్ పోటీల్లో తొలిసారి పోటీ చేసిన హొకాటో హోటోజె సెమా(40) .. భారత సైన్యంలో ఆర్మీ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తూ.. 2002లో ఒక టెర్రరిస్ట్ ఆపరేషన్ లో తన కాలుని కోల్పోవాల్సి వచ్చింది. అయిన ఆయన ధైర్యం కోల్పోలేదు. 32 ఏళ్ల వయసులో షాట్ పుట్ క్రీడను ఎంచుకొని ఏషియన్ పారా గేమ్స్ 2023లో 13.94 మీటర్ల త్రో చేసి కాంస్య పతకం సాధించాడు. 2023లో ప్రపంచ షాట్ పుట్ పోటీల్లో హొకాటో పాల్గొని ఏడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు హొకాటో హోటోజె సెమా తన దేశం కోసం పారిస్ పారాలింపికక్స్ లో కాంస్య పతకం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Also Read: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో

భారత్ మెడల్స్ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. శనివారం దలీప్ గావిత్ ఇండియా తరపున పురుషులు 400 మీటర్ల రన్నింగ్ పోటీల్లో పాల్గొననున్నాడు. గావిత్ ఇంతకుముందు 2022 ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధించాడడంతో ఈసారి పారిస్ పారాలింపిక్స్ లో అందరి చూపు ఆయనపై నే ఉంది.

ఇవే కాకుండా పురుషుల మెన్స్ జావెలిన్ త్రో F41లో భారత్ తరపున నవదీప్ ఉన్నాడు. మహిళల 200 మీటర్ల రన్నింగ్ పోటీల్లో సిమ్రన్ కూడా ఉంది. ఇంకా పారా సైక్లింగ్, పారా కెనో, పారా స్విమ్మింగ్ పోటీల ఫైనల్స్, సెమీ ఫైనల్స్ పోటీలకు భారత క్రీడా కారులు అర్హత సాధించారు. వీరందరూ పోటీతత్వం చూస్తుంటే.. ఈ సారి పారాలింపిక్స్ లో ఇండియా హై లైట్ కావడం ఖాయమనిపిస్తోంది.

Related News

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Big Stories

×