EPAPER

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతం పెంపు.. హర్యాణా ఎన్నికల ముందు బిజేపీ మాస్టర్ ప్లాన్!

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతం పెంపు.. హర్యాణా ఎన్నికల ముందు బిజేపీ మాస్టర్ ప్లాన్!

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతం పెంపు కోసం ఎదురుచూస్తున్న తరుణంలో త్వరలోనే వారికి మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. జీతంలో డిఏ (డియర్ నెస్ అలోవెన్స్) పెంచేందుకు 7వ పే కమిషన్ ప్రకటించబోతున్నట్లు సమాచారం. అయితే డిఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ మొదటివారంలోనే చేయాల్సిఉండగా.. అది కాస్తా అలస్య మైంది. కానీ హర్యాణా అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో ఈ ప్రకటన చేయనుందని తెలుస్తోంది. హర్యాణా అసెంబ్లీ ఎన్నికల అక్టోబర్ 5న జరుగనున్నాయి.


ఎన్నికల ముందు అధికార పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు తాయిలాలు ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ.. ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకోనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. గత కొనేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది దీపావళి కి ఒక వారం లేదా రెండు వారాలు ముందు ఉద్యోగులుక డిఏ పెంపు ప్రకటిస్తూ వస్తుంది. కానీ ఈ సంవత్సరం ఇంకా ముందస్తుగానే ఈ ప్రకటన వెలువడనుంది. హర్యాణా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే దీనికి కారణం.

Also Read| Live-In Relation Agreement: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?


జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డిఏ పెంపు గురించి సెప్టెంబర్ నెల చివరి వారంలో ప్రకటించనుంది. అక్టోబర్ 5న హర్యాణా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ జరుగనుండడంతో కొన్ని రోజుల ముందు ఈ ప్రకటన వెలువడనుంది. అయితే డిఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ పెంపు నాలుగు శాతం వరకు ఉంటుందని సమాచారం.

Also Read: EPS pension Any Bank: ఈపిఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై దేశంలో ఏ బ్యాంకులో నుంచి అయినా పెన్షన్ డ్రా చేయొచ్చు!

ఉద్యోగులకు.. కేంద్ర ప్రభుత్వం జీత భత్యాల్లో డిఏ, డిఆర్ ప్రతీ సంవత్సరంలో రెండు సార్లు పెంచుతుంది. ఒకటి జనవరిలో మరొకటి జూలై నెలలో. అయితే ఈ పెంపు గురించి ప్రతీ సంవత్సరం మార్చి లేదా అక్టోబర్ నెలల్లో ప్రకటిస్తుంది.

డిఏ అరియర్స్ కూడా విడుదల?
అయితే ఉద్యోగులు.. డిఏ అరియర్స్ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని..  అరియర్స్ సమస్య కూడా పరిష్కారం జరుగుతుందని ఉద్యోగుల ఆశాభావంతో ఉన్నారు. డిఏ పెంపు గురించి సెప్టెంబర్ చివరి వారంలో ప్రకటన రానుండగా.. పెరిగిన జీతం లేదా పెన్షన్ అక్టోబర్ నెల నుంచి అందే అవకాశం ఉంది. దీంతో పాటు ఉద్యోగులకు మూడు నెలల అరియర్స్ అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు అందుతాయి.

Also Read: ఉద్యోగుల చేత రాజీనామా చేయించడం కూడా ఒక బిజినెస్.. జపాన్ లో కొత్త వ్యాపారం

Related News

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Big Stories

×