వివో ఈ నెల అంటే సెప్టెంబర్ 11 నాటికి దేశీయ మార్కెట్‌లో Vivo T3 ultra స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో లాంచ్‌కు ముందు ఈ ఫోన్‌ టీజర్ కంపెనీ అధికారిక సైట్‌లో రిలీజ్ చేయబడింది.

ఈ స్మార్ట్‌ఫోన్ 12GB+256GB వేరియంట్‌లో సుమారు రూ. 33,000 ధరలో ఉండవచ్చని తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఇది 4,500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimension 9200 Plus చిప్‌సెట్ అమర్చబడింది.

ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 2, 8S Gen 3 ప్రాసెసర్‌ల ఆధారంగా స్మార్ట్‌ఫోన్‌లను అధిగమిస్తుందని భావిస్తున్నారు.

సమాచారం ప్రకారం.. Vivo T3 అల్ట్రా OIS మద్దతుతో 50MP SONY మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరాను పొందవచ్చని భావిస్తున్నారు.

ఈ స్మార్ట్‌ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది. దీని కారణంగా ఇది దుమ్ము, నీటి నుండి రక్షణను నిర్ధారిస్తుంది.

ఫోన్ పెద్ద 5500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

వివో నుంచి త్వరలో రాబోతున్న ఈ ఫోన్‌ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.