EPAPER

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..

Ganesh Chaturthi 2024 Wishes in Telugu: వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణేషుడు, లంబోధరుడు.. ఇలా ఆ మహా గణపయ్యను ఎంతో ముద్దుగా పిలుచుకుంటారు భక్తులు. హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. ఏ పని చేసిన అడ్డంకులు తొలగించేవాడు, ఏ పని మొదలు పెట్టిన ఏ శుభకార్యం చేయాలన్న ముందుగా పూజలందుకునే వాడు. విజయాన్ని అందించేవాడు.. జ్ఞానానికి దిక్కు.. అందుకే విజ్ఞాలను తొలగించే ఆ వినాయకుడు గురించి తెలుసుకోవాలన్నా అందరికి ఎంతో ఇష్టం. వినాయక చవితి భారతీయులు జరుపుకునే పండుగలలో ఒక ముఖ్యమైన పండుగ.


మట్టి వినాయకుడి విగ్రహాలను వాడ వాడ ప్రతిస్టించుకుని ఎంతో ఘనంగా జరుపుకునే వినాయక చవితి. పార్వతి పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టిన రోజు నాడే వినాయక చతుర్ధిగా నిర్వహించుకుంటారు. భాద్రపద మాసం శుక్ల పక్షంలో వచ్చేటటువంటి చతుర్ధి రోజున ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక పండుగ జరుపుకుంటుంన్నాం. ప్రతి ఇంట్లోనే బొజ్జగణపయ్య కొలువుదీరుతాడు. అందరూ తమ స్తాయికి తగ్గట్టు పూజలు నిర్వహిస్తుంటారు. అందరికి మంచి జరగాలని.. కోరుకున్నది నెరవేరాలని ఈ విఘ్నేశ్వరుడిని కోరుకుందాం. గణపతి కృప కలిగేలా.. ఈ అందమైన మెసేజ్ లతో ఫేస్ బుక్, ఇన్‌స్టా‌గ్రామ్, వాట్సాప్ ద్వారా మీ  బందువులకి,స్నేహితులకి శుభాకాంక్షలు తెలియజేయండి ఇలా..

Also Read: వినాయకుడిని ఏ దిశలో ప్రతిష్టించాలి ? వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది


మీరు మొదలు పెట్టే ప్రతి పనిలోను ఆ గణపయ్య ఆశీస్సులు తప్పకుండా ఉండాలని.. వినాయక చవితి పండుగ రోజు మీరందరూ ఆనందంగా గడపాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ.. నిర్విఘ్నం కురుమే దేవా.. సర్వకార్యేషు సర్వదా.. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

మీ జీవితంలో విఘ్నాలు తొలగిపోయి సుఖశాంతులతో వర్ధిల్లాలని.. ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ఎప్పుడు మీ పై ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.

భక్తితో కొలిచేమయ్యా బొజ్జ వినాయక.. దయతో మాపై కరుణ చూపయ్యా.. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

లక్ష్మీ గణపయ్య రావయ్య.. కోరిన కోర్కెలు తీర్చయ్యా.. హ్యాపీ వినాయక చవితి.

మీకు శ్రీ విఘ్నేశ్వరుడు సకల శుభాలను కలుగు జేయాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి.

ఆ గణేషుడు మీకు ఎల్లప్పుడు క్షేమా స్థైర్య, ధైర్య, ఆయురారోగ్యాలు ప్రసాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.

విఘ్మేశ్వరుడి చేతులో ఉండే లడ్డు ఎంత తియ్యగా ఉంటుందో.. అంతే తీయగా మీ జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి.

ఓం గంగం గణపతియే నమః ఈ 2024లో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.

మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

తల్లి రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వాక్పరిపాలన నీవు.. మమ్మల్ని రక్షించి కాపాడవయ్యా గణపయ్య.. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

 

Related News

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Vastu Tips: చనిపోయిన వారి ఫొటోను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి ?

Shukra Gochar 2024: శుక్రుడి రాశిలో మార్పు.. మొత్తం 12 రాశులపై ప్రభావం

Shani Kendra Trikon Rajyog: ఈ 3 రాశుల వారిపై శని అనుగ్రహం వల్ల ధనవంతులు కాబోతున్నారు

Ashwin Month 2024 : అశ్వినీ మాసం ఎంత కాలం ఉంటుంది ? ఉపవాసాలు, పండుగలు జాబితా ఇదే..

Big Stories

×