EPAPER

Chana Dal For Diabeties: డయాబెటీస్ ఉన్నవారికి శనగపప్పుతో ఉండే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..

Chana Dal For Diabeties: డయాబెటీస్ ఉన్నవారికి శనగపప్పుతో ఉండే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..

Chana Dal in Blood Sugar: శెనగప్పపుతో ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలిసి ఉండదు. శెనగపప్పులో విటమిన్స్, ప్రోటీన్స్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీంతో చాలా రకాల అనారోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. శెనగపప్పులో ఫైబర్, చక్కెర, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, శ్యాచురేటెడ్ ఫ్యాట్, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, విటమిన్స్ ఎ, సి, ఈ, మరియు జింక్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ వంటి చాలా రకాలా పోషకాలు ఉంటాయి. అంతేకాదు శెనగపప్పులో బీ కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. దీంతో చాలా రకాల జీవక్రయ సమస్యలను నివారించవచ్చు. అయితే కేవలం ఇది సాధారణ వ్యక్తులకు మాత్రమే కాకుండా డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు శెనగపప్పు అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


శనగపప్పు కేవలం రుచికి మాత్రమే కాకుండా నాణ్యతలోను అద్భుతంగా ఉంటుంది. అన్ని పప్పుల కంటే శనగపప్పు హైప్రోటీన్లను కలిగి ఉంటుంది. ఇందులో ఖనిజాలు అన్ని పప్పుల కంటే అధికంగా ఉంటాయి. అందువల్ల శనగప్పును వారానికి రెండు సార్లు అయినా తినడం వల్ల చాలా రకాల సమస్యలు ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలను కూడా నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది.

షుగర్ లెవెల్స్ కంట్రోల్ :


శనగపప్పును తీసుకోవడం వల్ల శరీరంలోని షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. అందువల్ల ఈ పప్పును డయాబెటీస్ ఉన్న వ్యక్తులు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసి దీర్ఘకాలిక వ్యాధిని నివారిస్తుంది.

బరువు నియంత్రణ :

శనగపప్పులో ఉండే పోషకాలు బరువు నియంత్రణకు సహాయపడతాయి. క్రమం తప్పకుండా దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక బరువు ఉన్నవారు సులభంగా తగ్గుతారు. దీనిలో ఉండే ఫైబర్ వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉండేలా చేస్తుంది.

గుండె ఆరోగ్యం :

గుండె ఆరోగ్యానికి కూడా శనగపప్పు అద్భుతంగా తోడ్పడుతుంది. ఇందులో ఉండే మోనో శాచురేటెడ్ కొవ్వులు శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వులను తగ్గించి మంచి కొలస్ట్రాల్ ను పెంచుతుంది. దీని వల్ల గుండె జబ్బులు వంటి ప్రమాదాలను తగ్గించుకోవచ్చు.

ఎముకలు బలంగా :

శనగపప్పులో ఉండే మెగ్నీషియం, కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అందువల్ల దీనిని ఆస్టియోపోరోసిస్ వంటివి తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారై, కీళ్ల నొప్పుల నుంచి కూడా నివారణ పొందవచ్చు.

జీర్ణక్రియ సమస్యలకు చెక్ :

శనగపప్పులో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచేందుకు సహాయపడతాయి. దీంతో అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు చర్మ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Rice Flour Face Packs: బియ్యంపిండిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే.. మచ్చలన్ని మటుమాయం

Big Stories

×