నిమ్మకాయ నీళ్ల వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అలాంటిది ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కు ముందు దీనిని తీసుకుంటే ఆరోగ్యానికి మరీ మంచిది.

వేసవికాలం అయినా, చలికాలం అయినా ఉదయాన్నే ఏమీ తినకుండా లెమన్ వాటర్ తాగితే అందులోని ఆల్కలీన్ శరీరానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

బరువు తగ్గాలి అనుకునేవారు ఉదయాన్నే లెమన్ వాటర్ తాగడం మంచిది. ఎందుకంటే ఇది శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది.

లెమన్ వాటర్ ఆహారాన్ని సులువుగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అంతే కాకుండా మలబద్ధకానికి కూడా ఇది మందులాగా పనిచేస్తుంది.

ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా లెమన్ వాటర్ మేలు చేస్తుంది. చర్మం అందంగా మెరవాలంటే ఉదయాన్నే లెమన్ వాటర్ తాగడం మంచిది.

ఒత్తిడి వల్ల శరీరంలో కలిగే ఎన్నో మార్పులకు లెమన్ వాటర్ పరిష్కారాన్నిస్తుంది. పలు బీ విటమిన్స్ వల్ల కలిగే శరీర సమస్యలను దూరం చేస్తుంది.

ఇమ్యూన్ సిస్టమ్‌ను మెరుగుపరచడంలో కూడా లెమన్ వాటర్ కీలక పాత్ర పోషిస్తుంది. లెమన్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జలుబు, జ్వరం నుండి దూరంగా ఉండవచ్చు.

సూచన : ఈ చిట్కాలు అవగాహన కోసం మాత్రమే