EPAPER

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు  వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

Wrestlers vinesh Phogat and Bajrang Punia Join Congress: ప్రముఖ రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఆయనతో కొద్దిసేపు చర్చించిన తరువాత వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ నేతలు వారి మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు. బుధవారం వారు పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలిసిన విషయం తెలిసిందే. పార్టీలో చేరిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.


‘కాంగ్రెస్ పార్టీకి పెద్ద థ్యాంక్స్ చెబుతున్నాం. రెజ్లర్లమందరం మాకు జరిగిన అన్యాయంపైన రోడ్డెక్కి ధర్నా చేశాం. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ మాకు అండగా నిలిచింది. రాహుల్ గాంధీతోపాటు ప్రముఖ కాంగ్రెస్ నేతలంతా మమ్మల్ని కలిసి మాకు సపోర్ట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు.. బీజేపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ కూడా మాకు అండగా నిలిచాయి. మేమెంత మొత్తుకున్నా బీజేపీ మా ఆందోళనను పట్టించుకోలేదు. ఆ సమయంలో మేం చాలా బాధపడ్డాం. నిజంగా ఆ సమయంలో మాకు అండగా నిలిచినందునే ఈరోజు మేం కాంగ్రెస్ పార్టీలో చేరాం. ఇక ముందు కూడా మా పోరాటం ఆగదు’ అని వారు పేర్కొన్నారు.

Also Read: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం


ఒలింపిక్స్ లో డిస్క్వాలిఫికేషన్ తరువాత ఆమె రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆమె ఇండియాకు వచ్చాక హర్యానా రైతులు, ప్రజలతో పలు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చింది.

కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు నేడు ఆమె తనకు ఉన్నటువంటి ఇండియన్ రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ తరువాత ఆమె మాట్లాడుతూ.. ‘ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సమయం.. గొప్ప సమయం. ఉద్యోగానికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకే రిజైన్ చేశాను. ఉద్యోగానికి సంబంధించిన రాజీనామాను సంబంధిత అధికారులకు అందజేశాను. నాకు ఉద్యోగ అవకాశం ఇచ్చినందుకు ఇండియన్ రైల్వేకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను’ అని పేర్కొన్నది.

ఇదిలా ఉంటే. వినేశ్ ఫొగట్ ఇటీవలే వార్తల్లో నిలిచారు. ఆ సమయంలో ఆమెకు దేశం మొత్తం అండగా నిలిచింది. ఈ మధ్యే జరిగిన ప్యారీస్ ఒలింపిక్స్ లో ఆమె 100 గ్రాముల పెరిగిందని ఆమెను పోటీ నుంచి డిస్క్వాలిఫై చేసిన విషయం తెలిసిందే. పోటీకి క్వాలిఫై అయ్యేందుకు ఆమె ఏకంగా తన జుట్టును కూడా కత్తిరించుకున్నది. అయినా కూడా వెయిట్ ఎక్కువున్నందునా ఆమె అనర్హులు అంటూ ఒలింపిక్స్ కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో యావత్ దేశం మొత్తం ఆమెకు సపోర్ట్ గా నిలిచింది. నీ ప్రయత్నం విఫలం కాలేదు అంటూ ఆమెకు మనోధైర్యాన్ని ఇచ్చిన విషయం విధితమే. ఇటు సామాన్య వ్యక్తి నుంచి ప్రధాని వరకు ఆమెకు అండగా నిలిచారు. ప్రధాని ఆమెకు ఫోన్ చేసి మరీ ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్నిచ్చారు. ఆ తరువాత ఆమె ఇండియాకు వచ్చిన సందర్భంగా ఆమెకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే వినేశ్ ఫొగట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు.

Also Read: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

అయితే, వచ్చే నెలలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా.. వీరిద్దరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయనున్నారని, అందులో భాగంగానే వారికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని పార్టీ వర్గాల టాక్.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఇందుకు సంబంధించి కూడా ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన లోక్ సభలో ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే.

Related News

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Big Stories

×