EPAPER

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

227 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్ లతో 105 నాటౌట్ తో నిలిచాడు. ఇప్పటికే అండర్ 19లో దుమ్ము దులిపిన ముషీర్ ఖాన్ ఇక్కడ అద్భుత ప్రదర్శన చేయడంతో జాతీయ జట్టులోకి తీసుకోక తప్పని పరిస్థితిని బీసీసీఐ సెలక్షన్ కమిటీకి కల్పిస్తున్నాడు. ఇంతకీ ఈ ముషీర్ ఖాన్ మరెవరో కాదు మన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే. వీరిద్దరూ ఒకే జట్టులో ఉన్నారు. అయితే సర్ఫరాజ్ 9 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. కానీ తమ్ముడు మాత్రం దుమ్ము రేపాడు.

అయితే తమ్ముడి ఆట చూసిన సర్ఫరాజ్ ఆనందంతో చప్పట్లు కొట్టాడు. సెంచరీ తర్వాత స్టేడియంలో అభిమానులందరూ నిలుచుని స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


94 పరుగులకే 7 వికెట్లు పడిపోయిన ఇండియా బీ.. టీమ్ ని ముషీర్ ఖాన్ ఆదుకున్నాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్ నవ్‌దీప్ సైనీ (28 బ్యాటింగ్) సాయంతో ఆడి, సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 79 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ తీసుకున్న ఇండియా బీ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (30), అభిమన్యు ఈశ్వరన్ (13) కాస్త ఓపికగా బ్యాటింగ్ చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ (9), రిషభ్ పంత్ (7), నితీష్ కుమార్ రెడ్డి (0), వాష్టింగన్ సుందర్ (0), సాయి కిషోర్ (1) దారుణంగా విఫలమయ్యారు.

దులీప్ ట్రోఫీ టోర్నీలో భాగంగా అనంతపురంలో జరుగుతున్న ఇండియా సి వర్సెస్ ఇండియా డి మధ్య మ్యాచ్ లో అక్షర్ పటేల్ అదరగొట్టాడు. ఇండియా డి తరఫున ఆడిన అక్షర్ పటేల్ …118 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86 పరుగులు చేసి, సెంచరీకి ముందు లాంగ్ షాట్ కొట్టి అవుట్ అయిపోయాడు.

ఇక్కడ కూడా ఒక దశలో ఇండియా డీ.. 48 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పుడు అక్షర్ పటేల్ ఆదుకున్నాడు. జట్టుకి 164 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా సి కూడా గొప్పగా ఆడటం లేదు. ఆట ముగిసే సమయానికి 91 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Related News

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Big Stories

×