ఫాల్సా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

ఫాల్సా పండ్లను ఇండియన్ షెర్బెత్ బెర్నీ అని కూడా పిలుస్తుంటారు. ఈ పండ్లు వేసవిలో సందడి చేస్తాయి.

ఫాల్సా పండ్ల‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫైబ‌ర్‌, విటమిన్లు, మిన‌ర‌ల్స్ వంటి ఎన్నో పోషకాలున్నాయి.

ఫాల్సాను నిత్యం తీసుకుంటే వీటిలో ఉండే ఫెనోలిక్‌, యాంటోసినిన్స్ వంటి యాంటిఆక్సిడెంట్స్ ఫ్రీ రాడిక‌ల్స్‌ను న్యూట్ర‌ల్ చేశాయి.

ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను నియంత్రించి హృద్రోగాలు, క్యాన్స‌ర్‌, మ‌ధుమేహం వంటి వ్యాధుల బారిన‌ప‌డే ముప్పును త‌గ్గిస్తాయి.

ఫాల్సా పండ్ల‌లో పొటాషియం లెవెల్స్ అధికంగా ఉండ‌టంతో పాటు సోడియం త‌క్కువ‌గా ఉండ‌టంతో బీపీని నియంత్రిస్తాయి.

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

బ‌రువు నియంత్ర‌ణ‌తోపాటు జీర్ణ‌శ‌క్తి పెరుగుద‌ల‌ ఉంటుంది.

ఈ పండ్లను తీసుకుంటే బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

చ‌ర్మ ఆరోగ్యంతోపాటు శ్వాస‌కోశ ఆరోగ్యం మెరుగు పడుతుంది.

ఈ పండ్లు.. శ‌రీరానికి ఉత్తేజాన్ని ఇస్తాయి.