EPAPER

Ravindra Jadeja: పొలిటికల్ ఇన్నింగ్స్.. బీజేపీలో చేరిన టీమిండియా స్టార్ క్రికెటర్

Ravindra Jadeja: పొలిటికల్ ఇన్నింగ్స్.. బీజేపీలో చేరిన టీమిండియా స్టార్ క్రికెటర్

Cricketer Ravindra Jadeja Joins BJP: టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు.


టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న జడేజా వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత కేవలం టెస్ట్, వన్డేలు మాత్రమే ఆడతానంటూ ప్రకటించాడు. అయితే, జడేజా అనూహ్యంగా పొలిటికల్ ఇన్నింగ్స్ ‌ను షేరూ చేశాడు. వాస్తవానికి రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఇప్పటికే బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే.

గుజరాత్‌లోని జామ్‌నగర్ ఉత్తర నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా, రవీంద్ర జడేజా కూడా బీజేపీలో చేరాడు. ఈ విషయాన్ని స్వయంగా రవీంద్ర జాడేజా భార్య రివాబా జడేజా ఎక్స్ వేదికగా ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగానే గుజరాత్‌లో కూడా సభ్యత్వ కార్యక్రమంలో విస్తృతంగా కొనసాగుతోంది.


ఈ నేపథ్యంలోనే రవీంద్ర జడేజా కూడా బీజేపీ చేరాడు. ఈ మేరకు రివాబా జడేజా తన ఎక్స్‌లో రవీంద్ర జడేజా బీజేపీ సభ్యత్వ ధ్రువీకరణ పత్రాలు ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే, రవీంద్ర జడేజా 2022 గుజరాత్ ఎన్నికల సమయంలో తన భార్య తరఫున కూడా ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నాడు.

ఇదిలా ఉండగా, గత జూన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇండియాకు కప్ అందించిన తర్వాత జడేజా టీ20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటినుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న జడ్డు..గత నెలలో శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్‌కు కూడా జట్టులోకి రాలేదు. గురువారం నుంచి ప్రారంభమైన దులీప్ ట్రోఫీ టోర్నీకి జట్టులోకి ఎంపికైన జడ్డుభాయ్..టోర్నీ ప్రారంభానికి వారం రోజుల ముందు టోర్నీ నుంచి తన పేరును ఉపసహకరించుకున్నాడు. మరోవైపు సెలక్షన్ కమిటీ కూడా అతని అభ్యర్థనను అంగీకరించింది.

Also Read: పుట్టినరోజు కూడా పాఠాలు: శిష్యుడికి బోధించిన యూవీ

కాగా, రవీంద్ర జాడేజా ఇప్పటివరకు 72 టెస్టు మ్యాచ్‌లు ఆడగా..3,036 పరుగులు, 294 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 197 మ్యాచ్‌లు ఆడగా.. 2,756 పరుగులు, 220 వికెట్లు తీశాడు. ఇక, టీ20ల్లో 74 మ్యాచ్‌లు ఆడగా.. 515 పరుగులు, 54 వికెట్లు పడగొట్టారు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×