EPAPER

Sitaram Yechury: ఎయిమ్స్‌లో సీతారాం ఏచూరి.. ఐసీయూలో చికిత్స

Sitaram Yechury: ఎయిమ్స్‌లో సీతారాం ఏచూరి.. ఐసీయూలో చికిత్స

AIIMS: సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరికి ఎయిమ్స్‌లోని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆయన ఆగస్టు 19వ తేదీన ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి ఇంకా ఆయన ఎయిమ్స్‌లోనే చికిత్స పొందుతున్నారు. తొలుత ఆయనను ఎమర్జెన్సీ వార్డ్‌లో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయనను ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఇంకా వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు గురువారం రాత్రి కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


72 ఏళ్ల సీతారాం ఏచూరి శ్వాస కోశ సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. న్యూమోనియా వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యతోనే ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఓ వైద్య బృందం సీతారాం ఏచూరికి చికిత్స అందిస్తున్నది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని ఆ వర్గాలు తెలిపాయి. కొన్ని వార్తా కథనాలు మాత్రం ఇందుకు భిన్నంగా రిపోర్ట్ చేశాయి.

సీతారాం ఏచూరికి ఇటీవలే కాటరాక్ట్ సర్జరీ అయింది.


సీతారాం ఏచూరి ఎయిమ్స్‌లో చేరిన తర్వాత కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్యకు నివాళి అర్పించే ఓ స్మారక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశానికి సీతారాం ఏచూరి హాజరుకావాలని అనుకున్నారు. కానీ, అనారోగ్యంతో అటెండ్ కాలేకపోయారు. అందుకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య స్మారక సమావేశానికి హాజరుకాకపోవడం తన పర్సనల్ లాస్ అని బాధపడ్డారు. ఆయన గురించి తన అభిప్రాయాలను ఎయిమ్స్ నుంచి చెప్పాల్సి రావడం బాధాకరంగా ఉన్నదంటూ తన అభిప్రాయాలతో ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Also Read: AP Deputy CM: పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్.. కీలక ఆదేశాలు

ఇదిలా ఉండగా.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ రోజు ఎన్‌కౌంటర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న 9 మందిని.. ఇవాళ ఆరుగురు మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌లో చంపేశారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ హత్యలేనని పేర్కొన్నారు. నక్సలైట్లను రూపుమాపుతామని కేంద్ర హోం శాఖ అమిత్ షా ప్రకటించారని గుర్తు చేశారు. వారిని ఇష్టమొచ్చినట్టుగా వేటాడి ఎన్‌కౌంటర్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. మావోయిస్టుల వైపు కూడా కొన్ని సార్లు అనుకోకుండా పొరపాట్లు జరిగి ఉండొచ్చని తెలిపారు.

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×