EPAPER

Auto Driver Slap: ఓలా రైడ్ క్యాన్సిల్ చేసిందని యువతిపై దాడి.. వీడియో వైరల్

Auto Driver Slap: ఓలా రైడ్ క్యాన్సిల్ చేసిందని యువతిపై దాడి.. వీడియో వైరల్

Ola Ride: ఓ యువతి ఓలా రైడ్ కోసం ఆటో బుక్ చేసింది. ఆ తర్వాత ఆ రైడ్‌ను క్యాన్సిల్ చేసి మరో ఆటోలో ప్రయాణం ప్రారంభించింది. ఓలా ఆటో డ్రైవర్ అక్కడికి లొకేషన్‌కు వచ్చాడు. రైడ్ క్యాన్సిల్ చేసిన యువతి మరో ఆటోలో వెళ్లుతుండటాన్ని గమనించాడు. ఆటోను అలాగే పోనిచ్చి ఆమె వెళ్లుతున్న ఆటోకు అడ్డంగా పెట్టి ఆపాడు. రైడ్ బుక్ చేసిన యువతిని కన్ఫమ్ చేసుకుని ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ యువతి చెంపపై కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.


మీరు నాపై ఎందుకు అరుస్తున్నారా? అరవడం ఎందుకు? అని ఆ యువతి అంటున్న మాటలతో వీడియో ప్రారంభమైంది. తప్పు ఎలా జరిగిపోతుంది? తప్పుగా ఎలా బుక్ చేస్తారు? అంటూ ఆ ఆటో డ్రైవర్ ప్రశ్నలు కురిపించాడు. ‘తప్పుగా బుక్ చేస్తే.. ఆటో ఇక్కడి దాకా వచ్చింది కదా.. మరి ఆటో నడవడానికి గ్యాస్ ఎవరు కొట్టిస్తారు? మీ అయ్య కొట్టిస్తాడా?’ అంటూ దురుసుగా మాట్లాడాడు.

మరో నిమిషం దూరంగా ఉండగా ఓలా రైడ్‌ను క్యాన్సిల్ చేసినట్టు యువతి పేర్కొంది. తాను తన ప్లాన్ చేసుకుని ఉండొచ్చు కదా.. అందుకే క్యాన్సిల్ చేశానని వివరించింది. ఓలాలో ఆ అవకాశం ఉన్నది కదా అని తెలిపింది. కానీ, ఆ డ్రైవర్ ఊరుకోలేదు. అలా ఎలా చేస్తారు? అంటూ ఫైర్ అయ్యాడు.


తనపై ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నిస్తూ.. తాను పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇస్తానని యువతి చెప్పింది. తాను కూడా వస్తానని ఆటో డ్రైవర్ అన్నాడు. తన ఆటోలోనే రావాలని ఆ యువతిని బలవంతపెట్టాడు. యువతి అందుకు నిరాకరించింది. తాను సేమ్ పోలీసు స్టేషన్‌కే రావాలని, ఆయనతోనే వెళ్లాలనేమీ లేదు కదా.. అని పేర్కొంది. తనకు ఇష్టమైన పోలీసు స్టేషన్‌కు వెళ్లుతానని చెప్పింది. ‘నీతో రావాల్సిన అవసరం లేదు. నీ మొబైల్ నెంబర్ ఉన్నది. నీ ఆటో నెంబర్ కూడా ఉన్నది.. ఇవి సరిపోతాయి ఫిర్యాదు చేయడానికి’ అని వివరించింది. ఇదే సమయంలో ఊహించని రీతిలో ఆ ఆటో డ్రైవర్ యువతిపై చేయి చేసుకున్నాడు. ఆమె చెంపపై కొట్టాడు. దీంతో ఆమె మరింత కోపంతో ఆటో డ్రైవర్‌ను తప్పుపట్టింది. ‘నాపై ఎందుకు చేయి వేశావు? ఎందుకు కొట్టావు? నేను ఎంతో గౌరవంగా మీరు అని మాట్లాడుతున్నాను. నన్ను ఎందుకు కొట్టావు?’ అంటూ యువతి ఆగ్రహించింది.

Also Read: AP Deputy CM: పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్.. కీలక ఆదేశాలు

చివరికి ఆ యువతి ఉన్న ఆటో డ్రైవర్ ఆటోను ముందుకు పోనివ్వడంతో వారు ఈ ఘటన నుంచి బయటపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోను పోస్టు చేసిన నెటిజన్.. సదరు ఆటో డ్రైవర్ పై సివియర్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టపగలు ఇద్దరు యువతులను ఓ ఆటో డ్రైవర్ ఎంత అలవోకగా బెదిరిస్తున్నాడో.. ఒకరిపై ఎంత సింపుల్‌గా దాడి చేశాడో.. కదా అని పేర్కొన్నారు. ఇది బెంగళూరులో శాంతి భద్రతలు సరిగా లేవనే సంకేతాలను పంపుతాయని, యువతులు సిటీలో సురక్షితంగా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నెటిజన్లు కామెంట్లు చేస్తూ సదరు ఆటో డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ ఆటో డ్రైవర్‌కు ఎంత ధైర్యం? వెంటనే ఆయన లైసెన్స్ క్యాన్సిల్ చేసి.. జైలులో వేయాలని డిమాండ్ చేశారు. ఓలా కంపెనీ కూడా డ్రైవర్ల క్యారెక్టర్‌ను కూడా పరిశీలించి హైర్ చేసుకోవాలని మరొకరు సూచించారు.

ఈ ఘటనపై బాధిత యువతి ఓలా సపోర్ట్‌ను సంప్రదించగా.. ఆటోమేటెడ్ మెస్సేజీ వచ్చింది.

Related News

Viral Video: ఇంత కక్కుర్తిలో ఉన్నావేంట్రా.. నేలపై పారుతున్న మద్యాన్ని ఎలా తాగేశాడో చూడండి

Viral Video: డాక్టర్‌పై చెప్పులతో దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Big Stories

×