విజయ్ హీరోగా నటించిన ‘ది గోట్’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఫస్ట్ డే ఈ సినిమా చూసిన చాలామంది సోషల్ మీడియా ద్వారా తమ రివ్యూలను బయటపెట్టారు.

ఇందులో విజయ్ నటన పెద్ద ప్లస్ అని ఆడియన్స్ అంటున్నారు.

ఇందులో యాక్షన్ సీన్స్‌ను బాగా ప్లాన్ చేసుకున్నారట దర్శకుడు వెంకట్ ప్రభు.

ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్ అన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

‘ది గోట్’లో పలు అంశాలు ఆడియన్స్‌ను అంతగా ఇంప్రెస్ చేయలేకపోయాయి.

రొటీన్ స్టోరీతో తెరకెక్కడం ‘ది గోట్’కు పెద్ద మైనస్‌గా మారింది.

కథనంలో ఏమైనా మార్పులు ఉంటాయేమో అని ఊహించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.

కథ, కథనం రొటీన్ అవ్వడం వల్ల ‘ది గోట్’ అక్కడక్కడా ఆడియన్స్ బోర్ ఫీలయ్యేలా చేసింది.

ఒక్క మాటలో చెప్పాలంటే ‘ది గోట్’ ఇంకా గ్రేట్‌గా ఉండే ఛాన్స్ ఉందని ఆడియన్స్ రివ్యూ ఇస్తున్నారు.