EPAPER

Medaram Forest: మేడారం అడవుల్లో ఏం జరిగింది ? విధ్వంసానికి కారణమేంటి ?

Medaram Forest: మేడారం అడవుల్లో ఏం జరిగింది ? విధ్వంసానికి కారణమేంటి ?

Medaram Forest Issue: ఓ ప్రమాదం జరిగింది. దాని తీవ్రత అంటే ఏ రేంజ్‌లో జరిగింది అని తెలుసుకోవాలంటే ఎలా? ఉదాహరణకు ఓ కారు ప్రమాదం జరిగింది. అప్పుడు డ్యామేజ్‌ అయిన కారును చూస్తే దాని తీవ్రత ఏంటనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇదే ఉదాహరణని మేడారం అటవీ ప్రాంతానికి అప్లై చేద్దాం. అప్పుడు తెలుస్తుంది అక్కడ జరిగిన దారుణమేంటి అనేది.


తెలంగాణలో తుఫాన్లు వస్తే ఏం జరుగుతుంది? భారీ వర్షపాతం నమోదవుతుంది.. మహా అయితే వరద విలయతాండవం ఆడుతుంది. కానీ మేడారం అటవీ ప్రాంతంలో అంతకుమించి జరిగింది. ఇప్పుడక్కడి పరిస్థితులు చూస్తుంటే.. ప్రకృతి ఎంత పవర్‌ఫుల్‌ అనేది అర్థమవుతోంది. 200 హెక్టార్లు.. అంటే అటు ఇటుగా 500 ఎకరాల విస్తీర్ణంలో అడవి నాశనమైంది. చెట్లు మొత్తం విరిగిపడ్డాయి. అసలు అక్కడి దృశ్యాలు చూస్తుంటే ఇక్కడో దట్టమైన అడవీ ఉండేది అన్నట్టుగా ఉంది.

అటవీ ప్రాంతాన్ని ఇంతలా డిస్ట్రర్బ్‌ చేసింది ఏంటి? డిస్ట్రాయ్ చేసింది ఏంటి? అనేది తెలుసుకునే పనిలో పడ్డారు ఫారెస్ట్ అధికారులు. ఇదంతా కూడా ఆగస్టు 31న సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఏడున్నర మధ్య జరిగిందని గుర్తించారు. కానీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎగ్జాక్ట్‌గా లెక్కకట్టలేదు కానీ.. 50 వేలకు పైగా చెట్లు విరిగిపోయాయి.


ఏదైనా హరికేన్ లాంటిది వస్తే కానీ ఇన్ని చెట్లు నెలకొరగవు. కానీ మన ఏరియాలో హరికేన్లు వచ్చే సమస్యే లేదు. కానీ ఇది అసాధ్యం కాదని అని అనిపిస్తోంది. ఎందుకంటే 500 ఎకరాల విస్తీర్ణం అంటే చిన్న విషయం కాదు. ఓ 15 కిలోమీటర్ల రేడియస్‌లో విధ్వంసం జరిగినట్టు తెలుస్తోంది. ఇదే స్థాయిలో సుడిగాలులు జనవాసాలు ఉన్న ఏరియాలో వచ్చి ఉంటే.. కథ మరోలా ఉండేది. అసలు ఆ సీన్లను ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది.

Also Read: కృష్ణమ్మ నుంచి బెజవాడను రక్షించిన ఆ వాల్ ను కట్టింది చంద్రబాబేనా ? జగనా ? అసలు నిజం ఏంటి ?

ప్రస్తుతానికి అక్కడేం జరిగిందన్నది ఓ మిస్టరీ. కానీ విజువల్స్‌ను అబ్జర్వ్‌ చేస్తే మీకో విషయం తెలుస్తోంది. విధ్వంసం జరిగిన ప్రాంతం.. ఆ పక్క ప్రాంతాన్ని చూడండి. మీకు తేడా ఈజీగా అర్థమైపోతుంది. హోరు గాలులు ఏ రేంజ్‌లో అక్కడ విధ్వంసం సృష్టించాయన్నది. అసలు అక్కడ ఇంతకుముందు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది? అనేది కూడా చూడండి.

ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడ సరిగ్గా ఏం జరిగిందో అంచనా వేయలేపోతున్నారు. అయితే ఇలా జరిగి ఉండవచ్చు అని ఓ రెండు మూడు అంచనాలను మాత్రం చెబుతున్నారు. అయితే ప్రాథమికంగా వారు చెప్పేది కాస్త నమ్మేలాగానే ఉంది. రిచ్ సాయిల్ కాబట్టి.. చెట్లు వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లడం లేదు. అందుకే గాలికి పడిపోయి ఉండొచ్చు అంటున్నారు. కానీ.. చాలా చెట్లు సగానికి విరిగిపోయాయి? దీనికి మాత్రం వాళ్ల దగ్గర సమాధానం లేదు. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ప్రాంతానికి అధికారులు క్యూ కట్టారు. మంత్రి సీతక్క కూడా అక్కడికి వెళ్లి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. ఈ ఏరియాలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదంటున్నారు ఆమె.

మంత్రి సీతక్క చెబుతుంది కూడా నిజమే. ఇదే పరిస్థితి జనవాసాల్లో జరిగితే పరిస్థితి ఏంటనేది ఆమె ప్రశ్న. కానీ అసలీ ఊహించని పరిస్థితులకు సరైన కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు రీపిట్‌ అయితే పరిస్థితి అయితే ఏం చేయాలన్న దానికి మనం ముందుగానే సమాధానం తెలుసుకోవాలి. ఇలాంటి ఘటనలను జరగడానికి ముందే గుర్తించే వ్యవస్థను తెలుసుకోవాలి.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×