EPAPER

Rahul Dravid: ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ.. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ద్రవిడ్

Rahul Dravid: ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ.. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ద్రవిడ్

Dravid signs deal with RR for head coach: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మళ్లీ ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. టీ20 ప్రపంచ కప్‌తో భారత కోచ్‌గా పదవీకాలం పూర్తి చేసుకున్న ద్రవిడ్..రాజస్థాన్ హెడ్ కోచ్‌గా నియమించుకున్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ తాజా మెగా వేలానికి సంబంధించి చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఈ మేరకు ఒప్పందం కూడా జరిగిందని, త్వరలోనే రాజస్థాన్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


రాబోయే మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ అంశంపై కూడా ఫ్రాంచైజీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. భారత జట్టులో ద్రవిడ్‌తో కలిసి పనిచేసిన విక్రమ్ రాథోడ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా తీసుకోవాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది. టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఉన్న సమయంలోనే విక్రమ్ రాథోడ్ కూడా బ్యాటింగ్ కోచ్‌గా సేవలు అందించాడు. నేషనల్ క్రికెట్ అకాడమీకి ద్రవిడ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు కూడా రాథోడ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు.

గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. దీంతో కేకేఆర్ ఫ్రాంచైజీలో ద్రవిడ్ మెంటార్‌గా చేరతాడనేప్రచారం జరిగింది. కానీ ద్రవిడ్‌కు రాజస్థాన్ ఫ్రాంచైజీలో అనుబంధం ఉండడంతోపాటు ఆ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అలాగే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆర్ఆర్‌కు మెంటార్‌గా పనిచేశాడు.


Also Read: పాకిస్తాన్ పేరిట.. చెత్త రికార్డులు

ఇదిలా ఉండగా, రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత హెడ్ కోచ్ కుమార్ సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, ఐపీఎల్ 2012, 2013 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్..2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్‌కు తీసుకెళ్లాడు. 2014, 2015లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×