EPAPER

70 Weds 25: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?

70 Weds 25: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?

70 Weds 25| పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు జీవితాంతం తోడుగా ఉండాలని ఒకరికొకరు చేసుకోనే వాగ్దానంతో ముడిపడిన బంధం. అయిదే మన చుట్టూ ఎన్నో విచిత్ర పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. ఒక చోట పెళ్లికొడుకు నల్లగా, పెళ్లికూతురు అందమైన కుందనుపుబొమ్మలా ఉంటే.. మరొక చోట అబ్బాయి ఆజానుబాహుడిలా ఉంటే అమ్మాయి లావుగా గజలక్షిలా ఉంటుంది. చూడడానికి వారి ఈడు జోడు వింతగా కనిపించినా.. పెళ్లి తరువాత ఆ దంపతుల మధ్య ప్రేమ ఉంటే చాలు వారి గురించి సమాజంలో ఎవరేమన్నా దాన్ని పట్టించుకోరు.


అలాంటిదే ఒక పెళ్లి ఇటీవల బిహార్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక 70 ఏళ్ల ముసలి వ్యక్తితో కేవలం 25 ఏళ్ల యువతి వివాహం చేసుకుంది. ఈ వివాహం వారి అంగీకారంతోనే జరిగిందని స్థానిక మీడియా తెలిపింది. బిహార్ రాష్ట్రంలోని గయా జిల్లా బైదా గ్రామంలో ఈ వివాహం జరిగింది.

బైదా గ్రామంలో నివసించే సలీముల్లా నూరాని అనే రైతుకు అదే గ్రామానికి చెందిన యువతి రేష్మా పర్వీన్ తో వివాహం జరిగింది. సలీముల్లా నూరాని వయసు 70 ఏళ్లు.. మరోవైపు రేష్మా వయసు 25 ఏళ్లు మాత్రమే. ఈ వివాహానికి గ్రామస్తులంతా అతిథులుగా వచ్చారు. విచిత్ర జంట పెళ్లి కావడంతో మీడియా జర్నలిస్టులు కూడా పెళ్లి గురించి తెలుసుకోవాలని వచ్చారు.


అయితే పెళ్లి తరువాత ఒక విలేకరి వరుడు సలీముల్లా నూరాని గురించి సమాచారం సేకరించాడు. సలీముల్లా భార్య నాలుగు నెలల క్రితం చనిపోయింది. అతనికి ఏడుగురు సంతానం. ఇద్దరు కొడుకులు, అయిదుగురు కుమార్తెలు. అయితే వారంతా వివాహం చేసుకొని నగరంలో జీవనం సాగిస్తున్నారు. వారికి కూడా పిల్లలున్నారు. ఈ క్రమంలో సలీముల్లా భార్య చనిపోవడంతో అతనికి ఇంట్లో ఒంటరితనంతో పాటు.. ఇంటిపనులు చేసుకోవడానికి సమస్య ఉండేది.

ఈ పరిస్థితుల్లో ఒంటరితనం వేధిస్తుండడంతో సలీముల్లా తన ఇంట్లో ఒక ఆడతోడు అవసరమని భావించి.. మళ్లీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు తనకు గ్రామంలో పరిచయమున్న ఒక స్నేహితుడితో తన సమస్య గురించి చెప్పాడు. ఈ క్రమంలో గ్రామంలో నివసించే రేష్మా పర్వీన్ తండ్రి పేదరికం కారణంగా తన కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాడు. కానీ కట్నం ఇచ్చే స్థోమత గానీ, అసలు పెళ్లి ఖర్చులకు కూడా అతని వద్ద ధనం లేదు. ఈ నేపథ్యంలో సలీముల్లా పెళ్లి సంబంధం తీసుకొని ఒకరు రేష్మా ఇంటికి వచ్చారు.

Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?

పరిస్థితి అంతా విన్నాక రేష్మా తండ్రి అందుకు ఒప్పుకున్నాడు. రేష్మా ఇంతకుముందే సలీముల్లాకు పరిచితురాలు. దీంతో పెళ్లికి రేష్మా కూడా అంగీకరించింది. ఇంకేముంది పెళ్లి తేదీ నిశ్చయమైంది. పెళ్లికి సలీముల్లా గ్రామస్తులందరినీ ఆహ్వానించాడు.

ఈ వింత పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఒక పోస్టు బాగా వైరల్ అయింది. ఈ పోస్ట్ పై చాలామంది నెటిజెన్లు కామెంట్ చేశారు. కొందరు ”కూతురు కంటే చిన్న వయసు అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంటాడు.. ఆ ముసలాడు” అని రాస్తే. మరో యూజర్ మాత్రం ”అతను వివాహం చేసుకున్నాడు. భార్య చనిపోయాక వ్యభిచారం చేయలేదు. తప్పేం లేదు.” అని రాశాడు.

Related News

Viral Video: ఇంత కక్కుర్తిలో ఉన్నావేంట్రా.. నేలపై పారుతున్న మద్యాన్ని ఎలా తాగేశాడో చూడండి

Viral Video: డాక్టర్‌పై చెప్పులతో దాడి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Mystery: చావు రహస్యం తేలిపోనుంది.. మరణం తర్వాత మూడో దశ!.. కన్ఫమ్ చేసిన సైంటిస్టులు

Flipkart: స్మార్ట్‌ఫోన్ పై 99 శాతం డిస్కౌంట్.. ఇదెక్కడి మోసమంటూ ఫ్లిప్‌కార్ట్‌పై కస్టమర్ల ఆగ్రహం

Viral Video: నూడుల్స్‌ని ఇష్టంగా లాగించేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Amazon Delivery After 2 Years: రెండేళ్ల క్రితం అమెజాన్ ఆర్డర్ క్యాన్సిల్.. రీఫండ్ పూర్తి.. ఇప్పుడు డెలివరీ!

Big Stories

×