EPAPER

Happy Teachers Day 2024: టీచర్స్ డే సందర్భంగా మీ ప్రియమైన ఉపాధ్యాయులకు ఇలా విషెస్ చెప్పండి

Happy Teachers Day 2024: టీచర్స్ డే సందర్భంగా మీ ప్రియమైన ఉపాధ్యాయులకు ఇలా విషెస్ చెప్పండి

Happy Teachers Day 2024: భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు ముఖ్యంగా ఉపాధ్యాయులపై విద్యార్థుల గౌరవం చూపడానికి అంకితం చేయబడింది. అయితే సెప్టెంబరు 5న మాత్రమే ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. దీని వెనుక చాలా ముఖ్యమైన, స్ఫూర్తిదాయకమైన ఓ కథ ఉంది.


సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం ఈ రోజు భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం కావడమే. డా. రాధాకృష్ణన్ గొప్ప విద్యావేత్త, తత్వవేత్త అంతే కాకుండా ఉపాధ్యాయుడు కూడా. అతను విద్యా రంగానికి అపూర్వమైన కృషి చేసాడు. అతని బోధనలు, ఆలోచనలు నేటికీ ఎంతో మందిని ప్రేరేపిస్తాయి. అందుకే రాధాకృష్ణన్ పుట్టిన రోజులు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుతణిలో జన్మించారు. ప్రముఖ తత్వవేత్త, రచయిత, ఉపాధ్యాయుడు, రాజకీయవేత్త అయిన రాధాకృష్ణన్ యొక్క మేధస్సు, విద్యా రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో ప్రబుత్వం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం “భారతరత్న” అవార్డును రాధాకృష్ణన్ కు ఇచ్చింది. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న టీచర్స్ డే రోజున మీరు కూడా ఈ సందేశాలను మీ ఉపాధ్యాయులకు పంపించండి.


1.ఎందరెందరినో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్ది..
మీరు మాత్రం అదే స్థాయిలో ఉంటూ..
విద్యార్థుల ఎదుగుదలను చూసి ఆనందపడుతూ..
ప్రతి ఒక్కరి జీవితంలో దిక్సూచిగా నిలిచిన మీకు
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు !

2. నా ఎదుగుదలను గురుదక్షిణగా భావించే..
నా ప్రియమైన గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

3. బడిలో చెప్పే పాఠం బ్రతుకు తెరువు చూపుతుంది.
గురువు చూపే మార్గం బ్రతుకు విలువ తెలుపుతుంది.
బెత్తంతో బెదిరించాలన్నా..
ప్రేమతో పలకరించాలన్నా మీకు ఎవరూ సాటిరారు.
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

4. ప్రతి వ్యక్తి ఎవరిని గౌరవిస్తాడో,
ఎవరైతే హీరోలను సృష్టిస్తారో,
ఎవరు మానవులను ఉన్నతమైన మానవులుగా మారుస్తారో,
అలాంటి గురువుకు నా నమస్కారం.
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

5. మీరు మా జీవిత పటంలో మార్గదర్శక నక్షత్రం.
మీ పాఠాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

6. మీరు నాకు జ్ఞానాన్ని అందించారు,
భవిష్యత్తు కోసం నన్ను సిద్ధం చేసారు,
మీ ఈ ఉపకారానికి పదాలు లేవు,
నా ఉపాధ్యాయులందరికీ నమస్కరిస్తున్నాను ,
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

7. మా జీవితంలోని చీకటిని పారద్రోలే సూర్యకాంతి మీరు
మీకు మా ధన్యవాదాలు
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

8. జీవిత మార్గంలో.. మీ మార్గదర్శకత్వంతో,
మేము ఉన్నత లక్ష్యాలను ఎంచుకున్నాము.
మీ రుణం తీర్చుకోలేనిది..
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు !

9. నేను పాఠశాలలో జ్ఞానాన్ని నేర్చుకున్నాను..
జీవించేందుకు అవసరమైన నిజమైన జ్ఞానాన్ని మీరు మాకు అందించారు
మీరు నా మొదటి, ఉత్తమ గురువు.
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

10. తల్లి కూడా గురువే, తండ్రి కూడా గురువే
స్కూల్ టీచర్ కూడా గురువే,
మనం ఎవరి దగ్గర ఏదైనా నేర్చుకున్నా..
వారందరూ మనకు గురువులే.
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

 

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×