EPAPER

Chia Seeds Health Benefits: చియా సీడ్స్‌తో బోలెడు బెనిఫిట్స్ !

Chia Seeds Health Benefits: చియా సీడ్స్‌తో బోలెడు బెనిఫిట్స్ !

Chia Seeds Health Benefits: చియా సీడ్స్ వల్ల ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిలోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వీటిలో కాల్షియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కొవ్వు, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఈ గింజలు పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ అధిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.


వీటిలో పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. బరువు తగ్గడానికి చియా విత్తనాలు అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తాయి. ఇందులో ఫైబర్ ప్రోటీన్, ఒమేగా – త్రీ ఫ్యాటీ యాసిడ్లతో పాటు అనేక సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. బరువు తగ్గడం కోసం చాలా మంది చియా సీడ్లను తింటూ ఉంటారు. నలుపు, తెలుపు రంగులో ఉండే ఈ చియాసిడ్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి క్యాన్సర్ నిరోధిస్తాయి. అంతేకాకుండా వీటితో అనేక ప్రయోజనాలు ఉంటాయి. చియా విత్తనాల్లోని క్యాల్షియం ఎముకలకు మంచి బలాన్ని ఇస్తాయి. రక్తంలో చక్కెరను కూడా ఇవి నియంత్రిస్తాయి. అంతేకాకుండా చియా విత్తనాల్లో ఉండే ఫైబర్, ప్రోటీన్ బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. చాలా మంది అధిక బరువుతో ఇబ్బందిపడేవారు వీటిని బరువు తగ్గడం కోసం తీసుకుంటారు. ఒక అధ్యయనం ప్రకారం చియా విత్తనాలను తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రోజుకు 28 గ్రాముల చియా విత్తనాలు తీసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. అంటే రోజుకు రెండు, మూడు టీ స్పూన్లు విత్తనాల తీసుకున్న తర్వాత పుష్కలంగా నీరు తాగాలి.


ఇవి జీర్ణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారు చియా సీడ్స్ తీసుకోవాలనుకుంటే నీటిలో కలిపి తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. చియా సీడ్స్ రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపున తినాలి. పాలు, ఓట్స్ తో కలిపి అల్పాహారంగా కూడా వీటిని తినవచ్చు. చియా సీడ్స్ లో ఎక్కువగా ఫైబర్ ఉండడం వల్ల ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. అలాగే చియా సీడ్స్ లో ప్రోటీన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. బీసీ కూడా నార్మల్ అవుతుంది. గుండె ఆరోగ్యం, కిడ్నీ, లివర్, చర్మ, జుట్టు ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. చియా సీడ్స్ తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.

Also Read: కాకర రసంతో షుగర్ వ్యాధికి చెక్ !

వెయిట్ లాస్ అవ్వడానికి చియా సీడ్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం పావు కప్పు చియా సీడ్స్ విత్తనాలను నాలుగు కప్పుల నీటిలో ఉంచి 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత అవి జెల్ లాగా మారుతాయి. వీటిని తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. వీటిని నీటిలో కలుపుకుని తరుచుగా తాగడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. చియా విత్తనాలతో స్మూతీలు ప్రిపేర్ చేసుకొని తాగిన కూడా మంచి లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నచ్చిన పండ్ల ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని వాటిలో పాలు , చియా విత్తనాలు వేసుకొని జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. అవసరమైతే రుచి కోసం కాస్త తేనె యాడ్ చేయాలి. ఇలా తయారు చేసుకుని తగడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Big Stories

×