EPAPER

Samsung Galaxy A06: శాంసంగ్ నుంచి సరికొత్త ఫోన్.. ఫీచర్లు చూస్తే మతి పోవాల్సిందే.. ధర ఎంతో తెలుసా?

Samsung Galaxy A06: శాంసంగ్ నుంచి సరికొత్త ఫోన్.. ఫీచర్లు చూస్తే మతి పోవాల్సిందే.. ధర ఎంతో తెలుసా?

Samsung Galaxy A06 Price India Launch Specifications Features: ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోనే.. మన ఇండియాలో స్మార్ట్ ఫోన్ల మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. చాలా కంపెనీలు తమ కొత్తరకం మోడల్స్ తో వినియోగ దారులను ఆకట్టుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ తరుణంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ల దిగ్గజ కంపెనీ శాంసంగ్.. మరో సరికొత్త శాంసంగ్ గెలాక్సీ ఎ06 ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో చిప్‌సెట్‌తో ఆధారితమైనది. ఈ స్మార్ట్ ఫోన్ 9.7 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్ప్లే కలిగి ఉంది. అలాగే 50 మెగాపిక్సెల్స్ ప్రైమరీ కెమరాను కలిగి ఉంది.


శాంసంగ్ గాలక్సీ A06 ధర
శాంసంగ్ గెలాక్సీ ఎ06 స్మార్ట్ ఫోన్ 4జీబీ/ 64జీబీ ఆప్షన్ ధర.. రూ.9999, 4జీబీ+ 128జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర సుమారు రూ.11,499. ఈ ఫోన్ ని సామ్ సంగ్ ఇండియా వెబ్ సైట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ నలుపు, బంగారం, లేత నీలం రంగు ఎంపికలలో ప్రవేశపెట్టారు.

శాంసంగ్ గెలాక్సీ A06 స్పెసిఫికేషన్స్, ఫీచర్లు


శాంసంగ్ గెలాక్సీ ఎ06 6.7 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, ఫ్రంట్ కెమెరా వాటర్ డ్రాప్ నాచ్‌ని కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 720 x 1,600 పిక్సెల్‌లు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో ఈ ప్రాసెలర్‌ని అమర్చారు. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ వరకు ఆన్ బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా వన్ UI 6లో పని చేస్తుంది. అలాగే సేఫ్టీ కోసం.. ఈ స్మార్ట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది.

Also Read: గూగుల్ పిక్సిల్ 9 ప్రో ఫోల్డింగ్ ఫోన్ వచ్చేసింది.. ధర కూడా తక్కువే జస్ట్..

ఇక కెమరా విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎ06 వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమరా, LED ఫ్లాష్ యూనిట్‌తో 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాను అమర్చారు. ముందు భాగంలో 8 మెగాపిరక్సెల్స్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీతో 25 డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ నిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఎంపికలలో అయితే.. డ్యూయల్ 4జీ, వైఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

ఇక సైజ్ విషయానికి వస్తే.. ఫోన్ ఫొడవు-167.3మిమీ, వెడల్పు 77.3 మిమీ, మందం 8.0 మిమీ, బరువు 189 గ్రా.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×