EPAPER

CM Chandrababu: బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చలేకపోయాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చలేకపోయాం: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఏపీలో కొనసాగుతున్న సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు వివరాలు వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చలేకపోయాం. బుడమేరు వద్ద గండ్ల పూడిక చర్యలు కొనసాగుతున్నాయి. 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బురద తొలగింపునకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఆహార పంపిణీలో వచ్చిన సమస్యలను పరిష్కరించాం’ అంటూ ఆయన పేర్కొన్నారు.


Also Read: వైసీపీ విమర్శలపై పవన్ కౌంటర్.. ఫస్ట్ సహాయం.. బుడమేరు 90 శాతం ఆక్రమణలు.. ఆ తర్వాతే..

‘ముంపు ప్రాంతాల్లో తాగునీరు అందిస్తున్నాం. 8 లక్షల వాటర్ బాటిల్స్ అందించాం. 5 లక్షల మందికి భోజనం అందజేశాం. విజయవాడకు బుడమేరు ఓ సమస్యగా మారింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఐదేళ్ళు అధికారంలో ఉన్న వైసీపీ ఏం చేసింది? కృష్ణానది కంటే బుడమేరుతో బెజవాడకు నష్టం జరిగింది. వరదలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇలాంటి దుర్మార్గులకు రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా? జనాన్ని భయపెట్టేలా వైసీపీ ప్రచారం చేస్తుంది. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. అందరికీ నాణ్యమైన ఆహారం అందజేస్తాం. అధికారులందరూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు’ అంటూ చంద్రబాబు అన్నారు.


Also Read: బాధితులను ఆదుకోకుండా విమర్శలేంటి? ఈ పాపం ఎవరిది?

‘రాక్షస మూక ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. మాట్లాడేటప్పుడు బుద్ధి, జ్ఞానం ఉండాలి. కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపకుండా విషాన్ని చిమ్ముతున్నారు. క్షమాపణ చెప్పేవరకు మిమ్మల్ని వదలిపెట్టను. మా ఇంటిలోకి నీళ్లు వస్తాయని బుడమేరులోకి నీరు వదిలామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విజయవాడలో చాలా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. మా ఇంటిలోకి నీళ్లు వచ్చాయి. పోయాయి. విపక్షం తప్పుడు ప్రచారం చేస్తోంది. రాజకీయ పార్టీ ముసుగులో అరాచకాలు చేస్తున్నారు. ఇలాంటివాళ్లు రాష్ట్రంలో ఉండటానికి అనర్హులు. అధికారులంతో ఫీల్డ్ లోనే పనిచేస్తున్నారు. విరాళాలు ఇచ్చేందుకు ఎంతోమంది ముందుకు వస్తున్నారు’ అని సీఎం పేర్కొన్నారు.

‘వరద బాధితుల కోసం 62 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశాం. 2100 మంది పారిశుద్ధ్య కార్మికులు బురద తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. వందకుపైగా ఫైరింజన్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. టిప్పర్లు, పొక్లెయిన్ల ద్వారా పేరుకుపోయిన మొత్తం చెత్తనంతా తరలిస్తున్నాం.

సహాయక చర్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. 179 సచివాలయాలకు 179 ఉన్నతాధికారులను ఇన్ చార్జులుగా నియమించాం. ఎవరైనా మృతిచెందితే వారి మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నాం. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చా. 3 లక్షల లీటర్ల పాలు, 5 లక్షల బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేశాం. గర్భిణీలకు ప్రత్యేక వైద్యం అందించాలంటూ అధికారు ప్రత్యేక ఆదేశాలిచ్చాం.

Also Read: చంద్రబాబు నివాసం, టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. వైసీపీ నేతలకు హైకోర్టు షాక్

విజయవాడకు బుడమేరు పెద్ద సమస్యగా తయారయ్యింది. చిన్న చిన్న వాగులన్నీ కలిసి బుడమేరు పెద్దదిగా మారిపోయింది. అటు కృష్ణానది, ఇటు బుడమేరు కలిసి ఎప్పుడు వర్షాలు వచ్చినా విజయవాడను ముంచెత్తుతున్నాయి. దీంతో విజయవాడ ప్రజలు ప్రతిసారి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరును అస్సలు పట్టించుకోలేదు. ఐదేళ్లపాటు పాలించిన వైసీపీ నేతలను ఏం చేశారంటూ ప్రశ్నిస్తున్నాం. వాగులను కబ్జా చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ఆఖరకు పోలవరం కాలువలో కూడా మట్టిని తవ్వేశారు. బుడమేరు నీరు కొల్లేరు, కృష్ణానదికి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. బుడమేరు ప్రవాహ దారిలో కాలువలు, వాగుల్లో కబ్జాలు తొలగిస్తాం. వైసీపీ నేతలు తమ పాలనలో తప్పులు చేసి తిరిగి మాపైనే ఎదురు దాడి చేస్తున్నారు. అమరావతి మునిగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారం’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×