EPAPER

Mulugu forest: ములుగు అడవుల్లో సుడిగాలి బీభత్సం.. నేల కొరిగిన వేలాది చెట్లు.. అసలేం జరిగింది?

Mulugu forest: ములుగు అడవుల్లో సుడిగాలి బీభత్సం.. నేల కొరిగిన వేలాది చెట్లు.. అసలేం జరిగింది?

Mulugu forest: ములుగు జిల్లాలో టోర్నడో తరహా గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు 50వేల చెట్లు నేలకూలాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు అడవిలో సర్వే చేపట్టారు.


ములుగు ఫారెస్ట్‌పై టోర్నడోలు విరుచుకుపడ్డాయి. తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో దాదాపు 50 వేల చెట్లు నేలకొరిగాయి. సుడిగాలి బీభత్సానికి మహా వృక్షాలు సైతం నేల కూలాయి. సుమారు 200 హెక్టార్లలో ఈ అడవులు విస్తరించాయి. ఆ దృశ్యాలు చూసి అధికారులే షాకయ్యారు. నార్మల్‌ గాలులకు ఈ చెట్లు నేలకొరగవని, బలమైన సుడిగాలులు మాత్రమే వీటిని కూల్చితాయన్నది అధికారుల మాట.

ALSO READ:  సికింద్రాబాద్‌-విజయవాడ రైళ్లకు అనుమతి..! రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ.. కొనసాగుతున్న ట్రయిల్ రన్


అక్కడి పరిస్థితి గమనించిన అధికారులు గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచినట్టు భావిస్తున్నారు. ఒకేసారి భారీ స్థాయిలో దాదాపు 50 వేల చెట్లు కూలిపోవడంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై డీఎఫ్ఓ రాహుల్ జాదేవ్ ఆధ్వర్యంలో టీమ్.. ఉపగ్రహ డేటా, భారత వాతావరణ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులతో పరిశీలన చేస్తున్నారు.

ములుగులో వేలాది చెట్లు నెల‌కొర‌గ‌డంపై మంత్రి సీత‌క్క ఆరా తీశారు. స‌చివాల‌యం నుంచి అధికారులతో మాట్లాడారు. రెండు రోజుల కిందట ఆ ప్రాంతాన్ని సంద‌ర్శించారు మంత్రి సీత‌క్క‌. ఈ ఘటన సెప్టెంబర్ ఒకటిన జరిగినట్టు సమాచారం. వేలాది చెట్లు నెల‌కూల‌డం ప‌ట్ల విస్మ‌యం వ్యక్తం చేసిన ఆమె, ఈ స్థాయిలో అట‌వీ సంపద విధ్వంసం జ‌ర‌గ‌డం ఎప్పుడూ లేదన్నారు. వందల ఎకరాల్లో నష్టం వాటిల్లిందన్న మంత్రి, విచారణకు ఆదేశించినట్టు తెలిపారు.

డ్రోన్ కెమెరాల సహాయంతో నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సుడిగాలి గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదని, స‌మ‌క్క సార‌ల‌మ్మ త‌ల్లుల వ‌ల్ల ఊర్ల మీద‌కు రాలేదన్నారు. చెట్లు నెల‌కూల‌డంపై కేంద్ర మంత్రులు కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్ ప్ర‌త్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అట‌వీ ప్రాంతంలో చెట్ల‌ను పెంచేలా ప్ర‌త్యేక నిధులు మంజూరు చేయాలని తెలిపారు.

 

 

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×