EPAPER

Chiranjeevi: వరద బాధితులకు సహాయం.. మేము సైతమంటూ నటుడు చిరంజీవి.. చెరో?

Chiranjeevi: వరద బాధితులకు సహాయం.. మేము సైతమంటూ నటుడు చిరంజీవి.. చెరో?

Chiranjeevi: తెలుగు రాష్ట్రాలను ఇటీవల వచ్చిన వరదలు కుదిపేశాయి. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలు ఊహించని విధంగా డ్యామేజ్ అయ్యాయి. విజయవాడ సిటీ ఇప్పటి కే జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఇప్పుడిప్పుడే వరద తగ్గుముఖం పడుతోంది. వరద కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు అందరూ ముందుకొస్తున్నారు.


సామాన్యుడి నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాలకు తన వంతు సాయం ప్రకటించారు. ఏపీ- తెలంగాణకు చెరో 50 లక్షలను విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.

ALSO READ: సికింద్రాబాద్‌-విజయవాడ రైళ్లకు అనుమతి..! రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ.. కొనసాగుతున్న ట్రయిల్ రన్


తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచి వేస్తున్నాయని రాసుకొచ్చారు చిరంజీవి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకర మన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆధ్వర్యంలో ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయని అన్నారు.

మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుందని, ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల్లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటించారు.  విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారాయన.

 

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×