EPAPER

Villages merged into Municipalities: 51 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం.. ఏ ఏ గ్రామాలయ్యాయంటే..?

Villages merged into Municipalities: 51 గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం.. ఏ ఏ గ్రామాలయ్యాయంటే..?

51 Villages merged into Municipalities: ఓఆర్ఆర్ పరిధిలోని పలు గ్రామాలను మున్సిపాలిటీల్లో కలిపింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓ ఆర్డినెన్స్ విడుదల చేసింది. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తున్నట్లు అందులో పేర్కొన్నది. మేడ్చల్, రంగారెడ్డి, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు గ్రామాలను విలీనం చేస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న 51 గ్రామాలను దగ్గర్లోని మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తాజాగా గెజిట్ ను రిలీజ్ చేసింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఈ 51 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు లేనట్లేనని చెబుతున్నారు.


తక్షణమే ఈ గెజిట్ నోటిఫికేషన్ అమలులోకి రానున్నదని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆ 51 పంచాయతీల రికార్డులు.. మున్సిపల్ అధికారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. డినోటిఫై చేస్తూ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి.

మేడ్చల్ మున్సిపాలిటీ, పోచారం మున్సిపాలిటీ, దమ్మాయిగూడ మున్సిపాలిటీ, ఘట్ కేసర్ మున్సిపాలిటీ, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ, అమీన్ పూర్ మున్సిపాలిటీ, తెల్లాపూర్ మున్సిపాలిటీ, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ, కుత్భుల్లాపూర్ మున్సిపాలిటీ, నాగారం మున్సిపాలిటీ, తూంకుంట మున్సిపాలిటీ, తుక్కుగూడ మున్సిపాలిటీ, నార్సింగి మున్సిపాలిటీ, శంషాబాద్ మున్సిపాలిటీల్లో ఈ 51 గ్రామాలు విలీనం కానున్నాయి.


Also Read: బ్రేకింగ్ న్యూస్.. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ తాజా రిపోర్ట్

ఏ ఏ గ్రామాలు.. ఏ ఏ మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయంటే.. ?

బహదూర్ గూడ్, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ హమీదుల్లానగర్, ఘంసీమిగూడ, రషీద్ గూడ – శంషాబాద్ మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.

గౌరెల్లి, బాచారం, కుత్బుల్లాపూర్ తారామతిపేట పంచాయతీలు – పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.

మీర్జాగూడ గ్రామపంచాయతీ – నార్సింగి మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.

హర్షగూడ గ్రామపంచాయతీ – తుక్కుగూడ మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.

రాయిలాపూర్, పూడూరు గ్రామపంచాయతీలు – మేడ్చల్ మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.

కీసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి – దమ్మాయిగూడ మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.

గోదాముకుంట, బోగారం, కరీంగూడ, రాంపల్లి దాయార గ్రామాలు – నాగారం మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.

Also Read: రాష్ట్రంలో విద్యా కమిషన్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ

ఔషాపూర్, అంకుషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘనాపూర్, మర్పల్లిగూడ – ఘట్ కేసర్ మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.

ప్రతాపసింగారం, వెంకటాపూర్, కొర్రెముల, కాచివానిసింగారం, చౌదరిగూడ గ్రామాలు – పోచారం మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.

గౌడవెల్లి, మునీరాబాద్ గ్రామపంచాయతీలు – గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి.

శామీర్ పేట, బాబాగూడ, బొంరాసిపేట గ్రామపంచాయతీలు – తూంకుంట మున్సిపాలిటీలో విలీనమయ్యాయి.

ఇదిలా ఉంటే.. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది సాహసోపేతమైన నిర్ణయమంటూ పలువురు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్న ప్రభుత్వం.. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నదంటూ అభినందనలు తెలుపుతున్నారు. ఈ నిర్ణయంతో ఆ గ్రామాల రూపురేఖలు మారనున్నాయని చెబుతున్నారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×