EPAPER

Deepthi Jeevanji: పతకం దిశగా తెలుగమ్మాయి

Deepthi Jeevanji: పతకం దిశగా తెలుగమ్మాయి

Deepthi Jeevanji: పారాలింపిక్స్ లో భారత్ పతకాల వేట జోరుగా సాగుతోంది. అయితే భారత అథ్లెట్ తెలుగమ్మాయి దీప్తి జీవాంజి. మహిళల 400 మీటర్ల టీ-20 విభాగంలో ఫైనల్ కు చేరింది. తనది తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా. అక్కడ పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో నివాసం . అయితే తను నిరుపేద కుటుంబంలో మేథోపరమైన బలహీనతతో జన్మించింది.


హీట్-1లో 55.45 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. అంతేకాదు అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు ఫైనల్ లో 8మంది పోటీ పడుతున్నారు. పోటీ నేటి రాత్రి 10.38కి జరగనుంది. ప్రస్తుతం ఉన్న ప్రపంచ రికార్డు (55.07 సెకన్లు) దీప్తి పేరిటే ఉండటం విశేషం. ప్రస్తుతం వరల్డ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా, వరల్డ్ రికార్డు హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పారిస్ పారాలింపిక్స్‌లో బరిలోకి దిగడం విశేషం. అందుకే అందరూ నమ్మకంగా ఎదురుచూస్తున్నారు.

స్కూల్ డేస్ లో పరుగు పందెంలో రాణించిన దీప్తిని.. పీఈటీ చూసి ప్రోత్సహించాడు. అలా కథ మారింది. తర్వాత ఇండియా జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపురి రమేశ్‌‌‌ శిక్షణతో ఆమె లక్ష్యం మారిపోయింది. నువ్వు ఇక్కడ ఉండటం కాదని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌‌‌‌‌‌‌‌) సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చారు. ఇప్పుడిలా పారిస్ పారాలింపిక్స్ లో వరకు తన ప్రయాణం సాగింది.


కోచ్ రమేశ్, ఇంకా పుల్లెల గోపించంద్ సహకారంతో ఆమె పారా అథ్లెట్‌గా పతకాల వేట కొనసాగిస్తోంది. ఆసియా పారా గేమ్స్‌‌‌‌‌‌‌‌ 400 మీటర్లు, వరల్డ్ పారా గ్రాండ్ ప్రీ ఈవెంట్ లో స్వర్ణాలు సాధించింది. అందుకే అందరి అంచనాలు భారీగా ఉన్నాయి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×