ఐఫోన్ అంటే అందరికీ ఇష్టమే. కానీ అధిక ధర కారణంగా కొందరు కొనుక్కోలేక తమ ప్లాన్ మార్చుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఆ అసవరం లేదు.

ఎందుకంటే ప్రముఖ ఈ -కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్లస్ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది.

iPhone 16 సిరీస్ సెప్టెంబర్ 9న ఆవిష్కరించబడుతోంది. దీంతో దీనికి ముందు ఐఫోన్ 15 సిరీస్‌లోని ప్లస్ మోడల్‌ ధర అమాంతంగా తగ్గింది.

ఈ మోడల్‌లోని బేస్ వేరియంట్ అయిన 128GB అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.89,600గా నిర్ణయించబడింది.

అదే వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,601 తగ్గింపుతో లభిస్తుంది. ఈ తగ్గింపు తర్వాత ఐఫోన్ 15 ప్లస్‌ను కేవలం రూ.75,999 లకే కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్లొచ్చు.

అలాగే ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి. HSBC లేదా ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIని ఉపయోగించే కస్టమర్‌లు రూ. 1,500 తగ్గింపు పొందుతారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా BOBCARD హోల్డర్‌లతో పాటు UPI లావాదేవీలను ఉపయోగించే వ్యక్తులు అదనంగా రూ.1,000 తగ్గింపు పొందుతారు.

దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఏకంగా రూ.50,850 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు.

ఈ ఫోన్ 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది A16 బయోనిక్ చిప్‌సెట్‌తో ఆధారితమైనది.

డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 48-మెగాపిక్సెల్ సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఇది 12-మెగాపిక్సెల్ TrueDepth కెమెరాను కలిగి ఉంటుంది.