EPAPER

Chhattisgarh encounter: మావోలకు ఎదురుదెబ్బ.. కాల్పులతో దద్దరిల్లిన బస్తర్, 9 మంది మృతి..

Chhattisgarh encounter: మావోలకు ఎదురుదెబ్బ.. కాల్పులతో దద్దరిల్లిన బస్తర్, 9 మంది మృతి..

Chhattisgarh encounter: మావోయిస్టులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఒకప్పుడు మావోలకు ఛత్తీస్‌గఢ్ పెట్టని కోట ఆ ప్రాంతం. ప్రస్తుతం అక్కడ మావోల ఉనికి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఎలాగలేదన్నా నెలకు నాలుగైదు ఎన్‌కౌంటర్లు ఆ ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయి.


తాజాగా దంతెవాడ-బీజాపూర్ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపు తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కూంబింగ్ ముమ్మరంగా సాగుతోంది.

ALSO READ:  అరేబియా సముద్రం.. కూలిన హెలికాప్టర్.. ఏం జరిగింది?


నిఘా వర్గాల సమాచారం మేరకు.. దంతెవాడ-బీజాపూర్ అడవుల్లో భారీ ఎత్తున మావోయిస్టులు సమావేశమైనట్లు తెలిసింది. రిజర్వ్ గార్డ్- సీఆర్పీఎఫ్ బలగాలు జాయింట్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. మంగళవారం ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైన ఎన్‌కౌంటర్.. ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు 9 మంది మావోల మృత దేహాలను గుర్తించారు. వారిలో ముగ్గురు మహిళలున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్ ఈ ఏడాది మావోయిస్టులకు కోలుకోని దెబ్బ తగిలింది. ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్ల లో దాదాపు 150 మంది మావోలు మరణించినట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో పెద్దఎత్తున ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

మావోయిస్టులకు కేరాఫ్‌ అడ్రాస్ దండకారణ్య ప్రాంతం ఛత్తీస్‌గఢ్. ఈ ప్రాంతం వారికి సొంత ఇల్లుగా భావిస్తున్నారు. కమెండోలకు అక్కడో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తారని పోలీసు అధికారులు చెబుతుంటారు. ఈ ప్రాంతం మావోలకు బలహీనంగా మారుతోంది. టెక్నాలజీ పుణ్యమాని వారిపై మరింత నిఘా పెంచాయి కేంద్ర-రాష్ట్రప్రభుత్వాలు.

వారం కిందట ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వివిధ రాష్ట్రాలకు చెందని సీనియర్ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 2026 మార్చి నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదం నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని వెల్లడించారు. గడిచిన పదేళ్లలో చూస్తే.. 2004-2014 నుంచి 2014-2024 కంపేర్ చేస్తే 50శాతానికి పైగానే నమోదైనట్టు తేలింది.

 

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×