Bigg Boss Nominations: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘బిగ్ బాస్ 8’ రియాలిటీ షో ప్రారంభం అయిపోయింది. సెప్టెంబర్ 1న గ్రాండ్ లెవెల్లో లాంచ్ చేయబడింది. ఈ సీజన్ 8కి దాదాపు 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వెళ్లారు. వారిలో ప్రేరణ, యష్మి గౌడ, విష్ణుప్రియ, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, అభయ్ నవీన్, ఢీ ఫేం నైనిక, శేఖర్ భాషలు కంటెస్టెంట్లుగా ఉన్నారు. మరోసారి నాగార్జున అక్కినేని వరుసగా ఆరోసారి హోస్ట్‌గా వచ్చారు. ఈ షోలో ఎలాంటి మలుపులు తిరుగుతాయో అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా దీన్ని అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్టుతో నడుపుతున్నారు. దీంతో ఈ సీజన్‌పై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ 8వ సీజన్ ఎన్నో సర్ప్రైజ్లు, కొత్త ట్విస్టులు, టాస్కులతో ఊహించని విధంగా ఉంటాయని హోస్ట్ నాగార్జున ముందుగానే చెప్పుకొచ్చాడు. అందుకు తగిన విధంగానే స్టార్టింగ్ ఎపిసోడ్ కొత్తగా సాగింది. మొదటి విషయం ఏమిటంటే సీజన్ 8 నుండి కెప్టెన్సీ తొలగించబడింది. అలాగే, ఇంటి రేషన్ లభ్యతలో కొన్ని షరతులు పెట్టబడ్డాయి. ఇక ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ మొదలవబోతుంది. బిగ్ బాస్ షోకి ఎలిమినేషన్ అనేది చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. ఈ ఎలిమినేషన్స్ ఆధారంగానే ఈ షో ముందుకు సాగుతుంది.
అందువల్లనే కంటెస్టెంట్లను ఎలిమినేషన్ జోన్లోకి తీసుకొచ్చే టాస్క్ నామినేషన్ ప్రక్రియ. అయితే ఈసారి నామినేషన్ ప్రక్రియ కూడా మారింది. సాధారణంగా సోమవారం రాత్రి నామినేషన్ ప్రక్రియ చూపబడుతుంది. కానీ ఈసారి కొత్త సీజన్ సోమవారం ప్రీమియర్ అయినందున, నామినేషన్ ప్రక్రియ వారం వారం బుధవారం ప్రసారం చేయబడుతుంది. వారం రోజులుగా ఆదరణ తగ్గడం గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత సీజన్లతో పోలిస్తే ఈసారి నామినేషన్ చాలా కొత్తగా ఉంటుందని సమాచారం.
Also Read: బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఆ హాట్ బ్యూటీకే హయ్యెస్ట్!
దీంతో ఈ వారం నామినేషన్స్ పెంట పెట్టేశాడు బిగ్ బాస్. ఈ నామినేషన్స్‌లో బిగ్ బాస్ హౌజ్‌కి చీప్‌గా నిఖిల్, యష్మీ గౌడ, నైనిక ఉన్నారు. వీరు ముగ్గురికీ నామినేషన్స్ నుంచి ఇమ్యునిటీ లభించింది. ఇక తొలివారంలో నామినేషన్స్‌లో టోటల్‌గా ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వారిలో నాగ మణికంఠ, బేబక్క, పృథ్వీ రాజ్, సోనియా ఆకుల, విష్ణు ప్రియ, శేఖర్ బాషా వంటి కంటెస్టెంట్లు నిలిచారు. అయితే ఈ నామినేషన్స్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ రీజన్స్ ఏవీ ఉండవు.
చిన్న చిన్న కారణాలే వీటికి దారితీస్తుంటాయి. ఇప్పటికి వచ్చిన ప్రతి సీజన్లోనూ చూశాం. ఇక ప్రస్తుత సీజన్ కూడా అలానే తయారైంది. తొలివారం చాలా సిల్లీగా సాగింది. హాయ్ చెప్పలేదని.. పడుకునేటప్పుడు బై చెప్పలేదని.. ఐ కాంటాక్ట్ ఇవ్వలేదని ఇలాంటి సిల్లీ సిల్లీ రీజన్స్ చూశాం. అలాంటి చిన్న చిన్న రీజన్ల వల్ల వీళ్లని నామినేషన్స్‌కి పంపించడం జరిగినట్లు తెలుస్తోంది. నామినేషన్స్‌లో ఆరుగురు ఉన్నారు.. కాబట్టి మీకు నచ్చిన కంటెస్టెంట్‌కు ఓటు వేసి వాళ్లను సేఫ్ చేయండి.