EPAPER

Pawan Kalyan: మా డిప్యుటీ సీఎం కనబడుటలేదు.. పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్, అసలు ఏమైంది?

Pawan Kalyan: మా డిప్యుటీ సీఎం కనబడుటలేదు.. పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్, అసలు ఏమైంది?

AP Deputy cm Pawan Kalyan not appearing and not respond in Vijayawada floods issue: ఏపీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి, గత మూడు దశాబ్దాలుగా ఇలాంటి వానలు ఎరగమని జనం అంటున్నారు. విజయవాడ కాస్తా విలయ వాడగా తయారయింది. నిన్న వాయినాడ్ వరదలు, నేడు విజయవాడ వరదలు ప్రకృతి కన్నెర్ర చేయడంతో ప్రజా జీవిన వ్యవస్థ అతలాకుతలంగా మారింది. చాలా చోట్ల వరద ప్రవాహం తగ్గినా ఇంకా మోకాలి లోతు నీళ్లలోనే జనం దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. అటు ఏపీకి ఇటు తెలంగాణకు మధ్య రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. అనేక బస్సులు, రైళ్లు నిలిచిపోయాయి. బుడమేరు సృష్టించిన వరద విలయానికి దాదాపు 4 లక్షల మంది విజయవాడ జనం నిరాశ్రయులయ్యారు. అయితే సకాలంలో చంద్రబాబు స్పందించిన తీరుకు జనం అభినందిస్తున్నారు.


కేటీఆర్ అభినందనలు

స్వయంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా చంద్రబాబు స్పందిస్తున్న తీరు పట్ల అభినందనలు తెలిపారు. ఇంతవరకూ చంద్రబాబుపై విమర్శలే లక్ష్యంగా చేసుకునన్న బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్వయంగా చంద్రబాబు పనితీరు పట్ల స్పందించడంపై నెటిజనులు స్పందిస్తున్నారు. వైజాగ్ తుఫాన్ వచ్చిన నెల రోజుల్లోనే విశాఖ పట్నం మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంది. ప్రస్తుతం విజయవాడ కూడా నెల రోజుల్లోనే మళ్లీ పూర్వవైభవం తెచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంత వాసులు. చంద్ర బాబు గత నాలుగు రోజులుగా విజయవాడలోనే మకాం వేశారు. ఎప్పటికప్పుడు టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. గతంలోనూ విశాఖపట్నం తీరంలో వచ్చిన హుద్ హుద్ తుఫాను దృష్టిలో పెట్టుకుని అదే తరహాలో విజయవాడ కూడా త్వరగా కోలుకునేలా పక్కా ప్రణాళికలు వేస్తున్నారు చంద్రబాబు. అయితే ఇప్పటికా వరద ప్రాంతాలను వివిధ శాఖల మంత్రులు పర్యటించారు. లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు.


జనసేనాని ఎక్కడ?

ఇంత విలయం జరుగుతున్నా జనసేనాని పవన్ కళ్యాణ్ వరదలపై ఎందుకు స్పందించడం లేదని సామాన్య ప్రజానీకం చర్చించుకుంటున్నారు. సామాజిక సమస్యలపై తక్షణమే స్పందించే పవన్ కళ్యాణ్ కనీసం క్షేత్ర స్థాయిలోనూ పర్యటించలేదని విమర్శిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అయితే ఆ రోజు కూడ అభిమానులెవరినీ ఇంటరాక్ట్ అవ్వలేదు. పైగా ఆ రోజు గబ్బర్ సింగ్ రీ రిలీజ్. దానిపైనా పవన్ స్పందించలేదు. ఈ నగరానికి ఏమయింది అన్నట్లు అసలు జనసేనానికి ఏమయిందని అంతా ఆరా తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా దాదాపు చంద్రబాబుకున్న రెస్పాన్సిబిలిటీ ఉంది. అలాగే ఇలాంటి ప్రకృతి భీభత్సాలు జరిగినప్పుడు స్పందించకపోతే ఎలా అని అందరూ పవన్ ని సోషల్ మీడియాలో ట్రోలింగులు చేస్తున్నారు.

అయోమయంలో జనసేన కార్యకర్తలు

ఇక వైసీపీ నేతలు సరేసరి. ఎప్పుడు ఛాన్స్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. వైసీపీ నేతలకు పవన్ స్వయంగా అస్త్రశస్త్రాలు ఇచ్చినట్లయిందని పవన్ అభిమానులు అంటున్నారు. కనీసం జనసేన కార్యకర్తలను పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లయితే వెంటనే సహాయక చర్యలలోకి దిగేవారమంటున్నారు. ఇప్పటికే పవన్ చెప్పకపోయినా తామంతా వరద సహాయక చర్యలలో చురుకుగా పాల్గొంటున్నామని అంటున్నారు. గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఏ సంఘటనకూ స్పందించడం లేదు. అయితే కొందరు మాత్రం జనసేనాని అలా ఎన్నటికీ చేయడని..ఆయన ఏదైనా విదేశీ పర్యటనలో ఉండివచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×