EPAPER

Mahabubabad Track: పూర్తికాని ట్రాక్ రిపేర్ పనులు.. మరో 28 రైళ్లు రద్దు

Mahabubabad Track: పూర్తికాని ట్రాక్ రిపేర్ పనులు.. మరో 28 రైళ్లు రద్దు

Trains Cancelled Between Vijayawada to Secundrabad : ఆగస్టు 31న కురిసిన భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లా కే సముద్రం – ఇంటికన్నె- తాళ్లపూసలపల్లి మార్గంలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ధ్వంసమైన ట్రాక్ ను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టింది దక్షిణమధ్య రైల్వే. దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. సుమారు పదివేల మంది ఉద్యోగులు ట్రాక్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారు.


శనివారం అర్థరాత్రి ట్రాక్ వరద తాకిడికి కొట్టుకుపోగా.. ఇప్పటికీ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దీంతో మూడోరోజు కూడా విజయవాడ – సికింద్రాబాద్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నిన్నటి వరకూ 496 రైళ్లు రద్దవ్వగా.. 152 రైళ్లను దారి మళ్లించారు. ట్రాక్ పునరుద్ధరణ పూర్తికాకపోవడంతో 28 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈ మేరకు సీపీఆర్ఓ శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు.

Also Read: ప్రకాశం బ్యారేజ్ గేట్ల డ్యామేజ్ పరిస్థితి ఏంటి? సీఎం చంద్రబాబు, నిపుణుడు కన్నయ్య పరిశీలన.. కాకపోతే..


సెప్టెంబర్ 3న రద్దయిన రైళ్లు

12709 – గూడూరు – సికింద్రాబాద్
12710 – సికింద్రాబాద్ – గూడూరు
12727 – విశాఖపట్నం – హైదరాబాద్
12739 – విశాఖపట్నం – సికింద్రాబాద్
20810 – నాందేడ్ – సంబల్ పూర్
12745 – సికింద్రాబాద్ – మణుగూరు
17659 – సికింద్రాబాద్ – భద్రాచలం రోడ్
17250 – కాకినాడ పోర్ట్ – తిరుపతి
17233 – సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్
12775 – కాకినాడ పోర్ట్ – లింగంపల్లి
12615 – ఎంజీఆర్ చెన్నై – న్యూ ఢిల్లీ
17205 – సాయినగర్ షిరిడీ – కాకినాడ పోర్ట్
12749 – మచిలీపట్నం – బీదర్
12750 – బీదర్ – మచిలీపట్నం
17208 – మచిలీపట్నం – సాయినగర్ షిరిడీ

సెప్టెంబర్ 4న రద్దయిన రైళ్లు

12746 – మణుగూరు – సికింద్రాబాద్
17660 – భద్రాచలం రోడ్ – సికింద్రాబాద్
11019 – సీఎస్ఎంటి ముంబై – భువనేశ్వర్
20707 – సికింద్రాబాద్ – విశాఖపట్నం
20708 – విశాఖపట్నం – సికింద్రాబాద్
20833 – విశాఖపట్నం – సికింద్రాబాద్
20834 – సికింద్రాబాద్ – విశాఖపట్నం
12706 – సికింద్రాబాద్ – గుంటూరు
12705 – గుంటూరు – సికింద్రాబాద్
17206 – కాకినాడ పోర్ట్ – సాయినగర్ షిర్డీ
17234 – సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్
12713 – విజయవాడ – సికింద్రాబాద్
12714 – సికింద్రాబాద్ – విజయవాడ
12776 – లింగంపల్లి – కాకినాడ పోర్ట్

సెప్టెంబర్ 5న రద్దయిన రైళ్లు

03260 – ఎస్ఎంవీటీ బెంగళూరు – దానాపూర్
17205 – సాయినగర్ షిరిడీ – కాకినాడ పోర్ట్

నిన్నటి వరకూ ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చిన వరద.. నేడు 8 లక్షల క్యూసెక్కులకు తగ్గిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు బుడమేరు, మున్నేరుకు సైతం వరద తగ్గడంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నెమ్మదిగా తగ్గుతుంది.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×