EPAPER

Tirumala Laddu: తిరుమల స్టేటస్ సింబల్ శ్రీవారి లడ్డూ.. ఇక దొరకడం కష్టమేనా ?

Tirumala Laddu: తిరుమల స్టేటస్ సింబల్ శ్రీవారి లడ్డూ.. ఇక దొరకడం కష్టమేనా ?

Tirumala Laddu Issue: తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయాలను మళ్లీ వివాదం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. గతంలో క్వాలిటి తగ్గించినప్పుడు నోరు మెదపని వారు బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడానికి ఆధార్‌ను అనుసంధానం చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారు. లడ్డూతో పాటు అన్న ప్రసాదం నాణ్యత పెంచినప్పుడు ప్రశంసాపూర్వకంగా ఒక్కమాట మాట్లాడని వారు.. లడ్డూ విషయంలో భక్తులకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. అసలేం జరుగుతుంది తిరుమలలో ? గతంలో లడ్డూ నాణ్యత తగ్గడానికి కారణమేమింటి? ప్రస్తుతం లడ్డూ నాణ్యతకు టీటీడీ తీసుకున్న చర్యలేంటి?


తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత భక్తులకు అంత్యంత ప్రియమైంది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం. సామాన్యుడి నుంచి ధనవంతుడు వరకూ.. పిల్లల నుంచి ముదుసలి వరకు అందరూ లడ్డూను అత్యంత ఇష్టంగా తీసుకుంటారు. ఇక్కడ మతాలతో కులాలతో సంబంధం లేదు.. ప్రతి ఒక్కరు ఇష్టంగా లడ్డూ ప్రసాదాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే అలాంటి లడ్డూను వివాదంగా మార్చి లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారు. దాని వెనుక ఉన్న హస్తం ఎవరిదో కూడా ఇప్పుడు బయటపడుతుంది.

గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో టీటీడీ మొత్తం ఓ వ్యక్తి కనుసన్నలలో నడిచింది. అతనే అదనపు ఈఓగా పనిచేసిన కేంద్ర రక్షణ శాఖ ఉద్యోగి ధర్మారెడ్డి.. ఈఓలు, పాలక మండలి చైర్మన్ల కంటే ఆయన పెత్తనమే ఎక్కువ నడిచింది. తన హయాంలో భక్తులను పూచిక పుల్లల్లాగా చూసాడు. భక్తులకు అందే అన్ని సౌకర్యాలను కట్ చేసాడు. అప్పుడు కనీసం ఎవ్వరు ఆయనను ఇదేమటని ప్రశ్నించలేదు. పైగా వందమాగదుల్లా భజన చేసారు. గతంలో టీటీడీ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలకు వినియోగించే నెయ్యిని కర్నాటక ప్రభుత్వ సహాకార సంస్థ అయిన నందిని డైరీ నుంచి నెయ్యి వచ్చేది.


Also Read: మోపిదేవి, జగన్‌కి హ్యాండ్ ఇవ్వడం వెనుక అసలు కథ ఇదే!

అయితే వారికంటే తక్కువ రేటుకు వస్తుందని ఉత్తరాది రాష్టాలకు చెందిన నెయ్యిని తెప్పించాడు. దాంతో పాటు లడ్డూలో వాడే దినుసల క్వాంటీటి,క్వాలీటీ కూడా తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో కరోనా రావడంతో లడ్డూల ఉత్పత్తికి తగ్గట్టు అమ్మకాలు లేక పోవడంతో.. లడ్డూ ధరను 25 రూపాయాల నుంచి 50 రూపాయలకు పెంచి అదనంగా ఇవ్వడం మొదలు పెట్టారు. నాణ్యత తగ్గించడంతో పాటు రేటు పెంచి లడ్డూల ను విరివిగా సరఫరా చేసామని గొప్పలు చెప్పుకున్నారు. అదే సమయంలో క్వాలీటి గురించి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడంతో పాటు.. అలాంటి వారి సొంత ఊర్లకు పోయి వారితో అంతా బానే ఉన్నట్లు చెప్పిస్తూ వీడియోలు తీయించి మరి పోస్టింగులు చేసారు.

అదే విదంగా అన్న ప్రసాదాల నాణ్యత గురించి ప్రశ్నించిన వారిని కూడా ఇబ్బంది పెట్టారు… ఇక్కడ కూడా నాణ్యత తగ్గించి నూకలు కలిపిన బియ్యాన్ని వాడారు. దాంతో పాటు రీ సైక్లింగ్ బియ్యాన్ని సైతం అన్న ప్రసాదంలో వాడారని అప్పట్లో ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే నాణ్యత లోపించింది. ఇదే విదంగా క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు మాట అటుంచి కనీసం చిన్నపిల్లలకు పాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. చివర్లో టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డి కొంత శ్రద్ద చూపించి అన్న ప్రసాదాలు పంపిణీ ప్రారంభించినా అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు కొండపై గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమలపై విచారణకు ఆదేశించారు. అదే సమయంలో అన్న ప్రసాదంతో పాటు లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచాలని.. క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు రెగ్యులర్ గా ఇవ్వాలని ఆదేశించారు. అందులో బాగంగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే ఈఓ శ్యామలరావు ఎక్కడ లోపాలు ఉన్నాయని గుర్తించడానికి రెగ్యులర్ తనిఖీలతో పాటు రివ్యూలు చేసారు. లడ్డూ ప్రసాద నాణ్యతను ఏ విధంగా పెంచాలనే విషయం మీద పోటు సిబ్బందితో పాటు మైసూరుకు చెందిన పాక శాస్త్ర నిపుణులను పిలిపించి వారితో చర్చించారు.

ఈ సందర్భంగా పోటు సిబ్బందితో పాటు పాక శాస్త్ర నిపుణులతో పలు దపాలుగా చర్చల తర్వాత బయటపడ్డ విషయం ఏమిటంటే లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యి నాణ్యత లేదని తేల్చారు. నెయ్యి సరఫరా చేస్తున్న ఉత్తరాది డెయిరీలకు షోకాజులు పంపారు. అయిన ఫలితం శూన్యం. 70 శాతం నెయ్యిని సప్లయి చేసే కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టారు. దీంతో పాటు కర్నాటక ప్రభుత్వ రంగ కంపెనీ అయిన నందిని నెయ్యి సరఫరాను తిరిగి పునరుద్ధరించారు. ఇదే సమయంలో నిపుణులు చెప్పిన విధంగా దినుసుల క్వాలిటీ, క్వాంటీటీ కూడా పెంచారు. దీంతో లడ్డూ నాణ్యత పెరిగింది.

తిరుమల లడ్డూ స్టేటస్ సింబల్ గా మారిపోయింది. కొంతమంది ప్రముఖులు లడ్డూను తమ వివాహ వేడకలతో పాటు తమ కంపెనీల వేడుకలలో పంచుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ బడాబాబు తన ఫంక్షన్ లో పంపిణీ చేయడం జరిగిందని సాక్షాత్తు ఇవో శ్యామల రావు తెలిపారు. శీవారి లడ్డూ అంటే అది పవిత్రమైన ప్రసాదమని.. ఫంక్షన్లలో పంచే స్వీట్ కాదని చురకలు అంటించారు.

Also Read: ఆ ఒక్క పేరు.. జగన్‌కి వెన్నులో వణుకు పుట్టిస్తోందా?

కొంతమంది క్యూ లైన్లలో లడ్డూ కొనుగోలు చేసి బ్లాక్ లో అమ్మడమే పనిగా పెట్టుకున్నారు. అదే వారి వృత్తిగా మారినట్లు గుర్తించారు. దానిని గమనించిన ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకయ్యచౌదరిలు దానికి చెక్ పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా దర్శనం చేసుకున్నవారికి ఓ ఫ్రీ లడ్డూతో పాటు.. అదనంగా నాలుగు నుంచి అరు వరకు ఓ వ్యక్తికి కొనుగోలు కౌంటర్లలో ఇస్తున్నారు. అదే సమయంలో దర్శనం దొరకని వారికి ఆధార్ అనుసంధానం చేసి రెండు లడ్డూలు రోజుకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు.

అయితే దీనిపై కొందరు లేనిపోని రచ్చ మొదలుపెట్టారు. భక్తులకు అన్యాయం జరుగుతుందని.. లడ్డూపై రేషన్ పెట్టి అన్యాయం చేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా సంస్థల్లో టీటీడీకి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఆధార్‌ అనుసంధానంపై ముందుగా ప్రకటించకుండా టీటీపీ అమలు చేయడం కొంత అయోమయానికి కారణమైందని తెలుస్తోంది. దానిపై ఈఓ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్ధం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ.. ఆధార్ కార్డు అనుసంధానంపై దుష్ప్రచారాన్ని కొట్టి పడేశారు.

గత మూడు నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న ప్రసాద నాణ్యత పెరిగింది. దాంతో పాటు క్యూలైన్లలోని భక్తులకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నారు. అయినా ఆ సంస్కరణల పునరుద్దరించడాన్ని పట్టించుకోని కొందరు మాత్రం లడ్డూల రేషనింగ్ అంటు హాడావుడి చేస్తున్నారు. కొన్ని ప్రజా సంఘాలు కూడా అదే చేస్తూ విమర్శల పాలవుతున్నాయి. గత పాలకమండళ్ల హయాంలో జరిగిన అవకతవకలు, ప్రసాదాల నాణ్యతల తగ్గింపుపై వ్యతిరేక ప్రచారం జరిగినప్పుడు.. అలా చేసిన వారిని పూర్తి స్థాయిలో కట్టడి చేయడమే కాకుండా.. వారిపై వివిధ రకాల కేసులు కూడా పెట్టారు.

శ్రీవాణి నిధుల గురించి సోషియల్ మీడియాలో ప్రశ్నించిన ఓ జర్నలిస్టుపై అయితే ఏకంగా గంజాయి కేసు పెట్టారు. కాని ప్రస్తుతం గాడిన పడుతున్నటీటీడీ పాలన పై మాత్రం విషం చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారని కూటమి నేతలు అంటున్నారు. అధికారులు మాత్రం సీఎం చెప్పిన విధంగా సామాన్య భక్తులకు తాము పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు. అదలా ఉంటే గాడి తప్పిన వ్యవస్థలను తిరిగి ట్రాక్‌లో పెడుతున్నామంటన్న ప్రభుత్వ పెద్దలు.. ఎవరిపైనా కక్షపూరిత చర్యలు వద్దంటున్నారు. అది అలుసుగా తీసుకునే కొండపై కొందరు ఇప్పుడు ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రౌతు మెత్తనైతే గుర్రం మాట వినదంటారు కదా.. అది ఇది ఇదేనేమో.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×