EPAPER

Ex Minister Ktr: ఆ విషయంలో భేష్ అంటూ.. చంద్రబాబును పొగిడేస్తున్న కేటీఆర్

Ex Minister Ktr: ఆ విషయంలో భేష్ అంటూ.. చంద్రబాబును పొగిడేస్తున్న కేటీఆర్

Ex Minister Ktr prised Chandrababu naidu best work done In floods: ఏపీలో, తెలంగాణలోనూ తీవ్ర మైన వర్షాలు, వరదలతో అటు ఇటూ రాకపోకలు దాదాపు స్తంభించిపోయాయి. నాలుగు లక్షల మందికి పైగా విజయవాడలో నిరాశ్రయులయ్యారు. వారికి పెద్ద ఎత్తున సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి తక్షణమే వారి అన్నార్తుని తీరుస్తోంది అక్కడి ప్రభుత్వం. అన్నా క్యాంటీన్ల ద్వారా పెద్ద ఎత్తున వంటలుచేయిస్తూ మారుమూల ప్రాంతాలకు ఆహార పొట్టాలను సరఫరా చేస్తున్నారు. స్వచ్ఛంద సేవలు కూడా చంద్ర బాబు పిలుపునందుకుని చురుకుగా వరద సహాయక చర్యలలో పాల్గొంటున్నాయి. రెస్క్యూ టీమ్ ఇప్పటికే వేలాది మందిని కాపాడింది. లక్షల సంఖ్యలో పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించాయి. వరద నీటి మధ్యలో ఇరుక్కున్న వారిని హెలికాప్టర్లు, మరబోట్ల సాయంతో వారిని ఒడ్డుకు చేరుస్తున్నారు. చంద్రబాబు గత నాలుగు రోజులుగా విజయవాడలోనే మకాం ఉంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులెవరూ లీవ్ లు పెట్టొద్దంటూ హెచ్చరించారు. ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇంత చేస్తున్నా వైఎస్ జగన్ ఏపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని అంటున్నారు.


కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వం

ప్రజల కనీస అవసరాలు తీర్చలేకపోతోందని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఎప్పుడూ చంద్రబాబును విమర్శించే కేటీఆర్ నోటి వెంట ఈ సారి పొగడ్తల వాన కురిసింది. వరద సహాయక చర్యలపై చంద్రబాబు స్పందిస్తున్న తీరు పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికప్పుడు ఆరు హెలికాప్టర్లు తెప్పించి, 150 కి పైగా రెస్స్కూ టీమ్ బో ట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలను సకాలంలో ప్రాణ నష్టం నుంచి కాపాడటంలో బాబు పనితీరు బాగుందంటూ కేటీఆర్ తన అధికార ఎక్స్ ద్వారా స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ వరద సహాయక చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందారని అంటున్నారు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందంటూ విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో వాగులు తెగి..వరదలు ముంచెత్తినా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని..రెస్క్కూ ఆపరేషన్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి జీరో మార్కులే అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు కేటీఆర్.


చంద్రబాబుపై అంత ప్రేమా?

ఎటువంటి సంబంధం లేకుండా ఓ జేసీబీ డ్రైవర్ తొమ్మిది మంది ప్రాణాలను కాపాడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయని..ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు కూడా చెయ్యలేని పని జేసీబీ డ్రైవర్ చెయ్యగలిగాడని అన్నారు. తెలంగాణలో వచ్చిన వరదలకు ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు. అయితే ఎన్నడూ లేని విధంగా కేటీఆర్ చంద్రబాబును పొగుడుతూ మరో పక్క రేవంత్ సర్కార్ ని విమర్శల పాలు చేయడం చూస్తుంటే కడుపులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్లుందంటూ నెటిజనులు ఫైర్ అవుతున్నారు. అప్పడు శత్రువని చెప్పి టీడీపీని తెలంగాణలో లేకుండా చేసిన విషయం ఇప్పుడు గుర్తుకురావడం లేదా అని అందరూ విమర్శిస్తున్నారు. ఇంత హఠాత్తుగా చంద్రబాబుపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తెలుస్తోందంటూ కేటీఆర్ ని ట్రోలింగ్ చేస్తున్నారు. పైగా ఇప్పుడు మీరేదో కొత్తగా కితాబు ఇవ్వాల్సిన పనిలేదు. అంటూ టీడీపీ శ్రేణులు సైతం మండిపడుతున్నాయి.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×