EPAPER

Deepika Padukone: కల్కి బ్యూటీ దీపికా పదుకొనె బేబీ బంప్ ఫోటోషూట్.. భర్తతో కలిసి..

Deepika Padukone: కల్కి బ్యూటీ దీపికా పదుకొనె బేబీ బంప్ ఫోటోషూట్.. భర్తతో కలిసి..

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న హీరోయిన్ అంటే టక్కున దీపికా పేరే చెప్పుకొస్తారు.


ఉపేంద్ర  హీరోగా నటించిన  ఐశ్వర్య అనే కన్నడ  సినిమాతో ఇండస్ట్రీలోకి  అడుగుపెట్టింది. ఆ తరువాత ఆమె 2007లో షారుఖ్ ఖాన్  హీరోగా నటించిన ఓం శాంతి ఓం చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.


మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న దీపికా ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా దీపికా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక దీపికా పదుకొనే.. 2018 లో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంట వివాహం అప్పట్లో పెద్ద సెన్సేషన్ ను సృష్టించింది. వీరిద్దరి కాంబోలో రామ్ లీల, బాజీరావు మస్తానీ లాంటి సినిమాలు వచ్చాయి.

పెళ్లి తరువాత కూడా దీపికా అందాల ఆరబోతను ఏ మాత్రం తగ్గించలేదు. జవాన్, పఠాన్ లాంటి సినిమాలల్లో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు.

ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా- రణవీర్.. తాము తల్లిదండ్రులు కాబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. దాదాపు ఐదేళ్ల తరువాత దీపికా ప్రెగ్నెంట్ అయ్యినట్లు తెలిపింది.

ఇక ప్రెగ్నెంట్ అయ్యాక కూడా దీపికా.. సినిమాలు చేస్తూనే వచ్చింది. నాలుగో నెల రన్ అవుతున్న సమయంలో దీపికా.. సింగం ఎగైన్ షూటింగ్ లో పాల్గొంది. ఇక తెలుగులో దీపికా కల్కి 2898AD  సినిమాతో పరిచయమైన విషయం తెల్సిందే.

కల్కి పప్రమోషన్స్ లో కూడా దీపికా బేబీ బంప్ తోనే ప్రత్యక్షమయింది. ప్రెగ్నెంట్ తో ఉన్న భార్యను రణవీర్ సెకన్ కూడా వదిలిపెట్టకుండా చూసుకుంటున్నాడు.

ఇక బాలీవుడ్ లో ఎప్పటినుంచో బేబీ బంప్ ఫోటోషూట్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోయిన్స్.. తమ భర్తలతో కలిసి బేబీ బంప్ ఫోటోషూట్స్ లో పాల్గొంటూ ఉంటారు.

ఇక తాజాగా దీపికా – రణవీర్ కూడా  బేబీ బంప్ ఫోటోషూట్ ను ఫినిష్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను దీపికా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ పరిమితం లేని ప్రేమకు దిష్టి తగలకుండా.. దిష్టి ఎమోజి క్యాప్షన్ గా పెట్టుకొచ్చింది.

ఇక ఈ ఫొటోలన్నీ మోనోక్రోమ్ లో క్లిక్స్ చేసినట్లు కనిపిస్తున్నాయి. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా కూడా దీప్ వీర్ లు ఎంతో అందంగా కనిపించారు. తమ ప్రేమకు ప్రతిరూపం అయిన బిడ్డకోసం ఎదురుచూస్తున్నట్లు కనిపించారు.

ఇక దీపికా ఫ్యాషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ట్రెండ్ ఫాలో ఎవ్వడు.. ట్రెండ్ సెట్ చేస్తుంది. ఈ బేబీ బంప్ ఫోటోషూట్ కూడా అలాగే అనిపిస్తుంది. పెద్ద పెద్ద గౌన్స్, న్యూడ్ గా కాకుండా ట్రెండీ అవుట్ ఫిట్ లో దీపికా అదరగొట్టేసింది.

బ్లాక్ కలర్ డిజైనర్ నెట్ డ్రెస్ లో దీపికా ఎంతో అందంగా కనిపించింది. మొత్తం మూడు డిజైనర్ డ్రెస్ లతో ఈ బేబీ బంప్ ఫోటోషూట్ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దీపికా బేబీ బంప్ ఫోటోషూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు.. ఆరోగ్యకరమైన బిడ్డకు దీపికా జన్మనివ్వాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

త్వరలోనే దీపికా- రణవీర్ తల్లిదండ్రులు కానున్నారు. మరి ఈ జంటకు వారసుడు వస్తాడో.. వారసురాలే వస్తుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Related News

Shraddha Das: అబ్బా.. గుండెలను పిండేస్తున్న అందాల విస్ఫోటనం

Mrunal Thakur: కాటుక కళ్లతో కట్టిపడేస్తున్న మృణాల్.. ఇది కదా మాకు కావాల్సింది!

Aishwarya Rajesh: ట్రై చేస్తోన్న ఐశ్వర్య‌ రాజేష్, కనెక్ట్ కాలేదా?

Neha Sharma Photos: చిరుత బ్యూటీ నేహ శర్మ గ్లామర్ ఫొటోలు.. వయసుతోపాటు అందం పెరుగుతోందా?!

Dushara Vijayan: రెడ్ కలర్ డ్రెస్ లో రాయన్ బ్యూటీ ఘాటు అందాలు

Redmi Note 14 Pro+: షాక్ ఇచ్చిన షియోమీ.. ఆ ఫోన్‌లో సామర్థ్యం తగ్గించేసిన కంపెనీ, ఎంతంటే?

Heroine Sreeleela: పిచ్చెక్కిస్తున్న కుర్ర హీరోయిన్.. కొత్త ఫోజులతో అదరగొడుతూ..

Big Stories

×