EPAPER

CM Revanth Reddy: వానలు కొడుతున్న వేళ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ.. అందులో ఏం ప్రస్తావించారంటే..?

CM Revanth Reddy: వానలు కొడుతున్న వేళ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ.. అందులో ఏం ప్రస్తావించారంటే..?

CM Revanth Reddy Writes to PM Modi: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వానల కారణంగా రాష్ట్రంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పలు చోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధానిని కోరారు. అదేవిధంగా వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలంటూ ఆ లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి తక్షణ సాయాన్ని వెంటనే అందజేయాలంటూ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


Also Read: ఏపీ, తెలంగాణలో వర్షాలు.. 21 రైళ్లు రద్దు.. 10 ట్రైన్స్ దారి మళ్లించిన సౌత్ సెంట్రల్ రైల్వే

ఇదిలా ఉంటే.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహించిన సమీక్షలో పలువురు అధికారులకు ఆయన పలు ఆదేశాలను జారీ చేశారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య లేకుండా కమిషనర్లు చూడాలని ఆదేశించారు. అదేవిధంగా వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. విద్యుత్ సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.


Also Read: తెలంగాణ-ఏపీ మధ్య రాకపోకలు బంద్..ప్రయాణాలు మానుకోవాలని విజ్ణప్తి

సమీక్ష అనంతరం ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గం గుండా బయలుదేరివెళ్లారు. మార్గమధ్యలో కోదాడలో ముంపు ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. రాత్రి ఖమ్మంలో బస చేయనున్నారు. మంగళవారం తెల్లవారుజామున మహబూబాబాద్ చేరుకుని అక్కడ కూడా ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు.

Related News

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Big Stories

×