బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు.

బీట్ రూట్‌లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

బీట్ రూట్ తింటే కొన్ని రకాల క్యాన్సర్లను, ముఖ్యంగా మూత్రాశయ క్యాన్సర్‌ను నివారిస్తుంది.

శరీరంలో కీళ్లు, మోకాళ్ల వాపును తగ్గిస్తుంది.

బీట్ రూట్‌లో ఉండే నైట్రేట్లు గుండెను కాపాడతాయి. ఇందులో ఉండే నైట్రేట్లు రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడతాయి.

గ్లూటామైన్ అధికంగా ఉంటుంది. ఇందులో అమైనో ఆమ్లాలు పొట్ట ఆరోగ్యానికి సహాయపడతాయి.

బీట్ రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో పాటు బీటావిన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తిని కూడా పెంచుతాయి.

బీట్ రూట్ జ్యూస్ తాగడంతో వ్యాయామం చేసే సామర్థ్యం పెరుగుతుంది.

మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది మెదడుకు మేలు చేస్తుంది.

ఇందులో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి ధమనులను ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతాయి.

బీట్ రూట్ రసం రక్త ప్రసరణను పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది.