EPAPER

Pak vs Ban Highlights: పాకిస్తాన్ కు.. మరో అవమానం తప్పదా?

Pak vs Ban Highlights: పాకిస్తాన్ కు.. మరో అవమానం తప్పదా?

Pakistan vs Bangladesh 2nd Test Highlights: బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ ఓటమితో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీక అలమటిస్తున్న పాకిస్తాన్ కు పుండు మీద కారం జల్లినట్లయ్యింది. ఎందుకంటే బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో కూడా పరిస్థితులు అంతా ఆశాజనకంగా కనిపించడం లేదు.


స్వదేశంలోని రావల్పిండిలో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 274 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సయామ్ ఆయుబ్ (58), కెప్టెన్ షాన్ మసూద్ (57), సల్మాన్ ఆలీ (54) ముగ్గురూ హాఫ్ సెంచరీలు చేశారు. అయితే మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ (31) మాత్రం ఆ పరుగులు చేయడానికి కష్టపడ్డాడు. చాలా టెన్షన్ పడ్డాడు.

బంగ్లా బౌలింగులో తస్కిన్ అహ్మద్ (3), హసన్ మిరాజ్ (5), షకీబ్ (1), నహిద్ రాణా (1) వికెట్లు పడగొట్టారు.


అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ కి ఘోర అవమానం తృటిలో తప్పింది. ఎందుకంటే ఒక దశలో 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి గిలగిల్లాడింది. ఈ దశలో వికెట్ కీపర్ లిటన్ దాస్ అడ్డంగా నిలబడిపోయాడు.

హాసన్ మిరాజ్ (78) తో కలిసి ఏడో వికెట్ కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో లిటన్ దాసు 228 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 138 పరుగులు చేసి బంగ్లాదేశ్ పరువు నిలబెట్టాడు. తొమ్మిదో వికెట్ గా వెనుతిరిగాడు.

Also Read: బాబూ.. బంగ్లా అక్కడ వణికిస్తోంది జాగ్రత్త!

మొత్తానికి తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 262 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అలా పాకిస్తాన్ కు తొలిఇన్నింగ్స్ లో 21 పరుగుల ఆధిక్యం లభించింది.

పాకిస్తాన్ బౌలింగులో ఖుర్రాం షహజాద్ అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు పడగొట్టాడు. మిర్ హమ్జా 2, సల్మాన్ అలీ 2 వికెట్లు పడగొట్టారు.

ఎట్టకేలకు మూడోరోజు ఆట ముగిసింది. అంటే మొదటిరోజు వర్షం కారణంగా ఆట జరగలేదు. అయితే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాకిస్తాన్ కి ఆదిలోనే హంసపాదులా… ఆల్రడీ 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.

ఇక నాలుగో రోజు ఆటలో గట్టిగా పరుగులు తీసి, బంగ్లాకి  గట్టి టార్గెట్ ఇచ్చి, ఐదోరోజు వారిని ఆల్ అవుట్ చేసి విజయం సాధించాలి. అప్పుడు సిరీస్   సమం అవుతుంది. లేదంటే మాత్రం స్వదేశంలో పాకిస్తాన్ క్రికెట్ కి ఘోరీ తప్పదని అంటున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×