EPAPER

Joe Root: నేను అలాంటోడ్ని కాను: జో రూట్

Joe Root: నేను అలాంటోడ్ని కాను: జో రూట్

Joe Root Reacts to Making History with Record-Breaking 34th Test Century: సెంచరీల మీద సెంచరీలు చేస్తూ.. అప్రతిహితంగా సాగిపోతున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో తను మాట్లాడుతూ నేను రికార్డుల కోసం ఆడే ఆటగాడిని కాదని తెలిపాడు.


నావల్ల జట్టు గెలిస్తే అంతకన్నా సంతోషం ఏం ఉంటుందని అన్నాడు. నిజానికి సెంచరీ చేస్తే నాకే లాభం ఉంటుంది. నా కెరీర్ కి ప్లస్ అవుతుంది. లేదంటే ఒక రికార్డు దగ్గరవుతుంది. లేదా దాటుతుంది. అది నా వరకే.. దాని వల్ల జట్టుకేమిటి? లాభం? అని ప్రశ్నించాడు.

మేం జట్టులో 11మంది ఉన్నాం. నా రికార్డుల కోసం కాదు కదా ఆడేది, దేశం కోసం ఆడుతున్నాం. జట్టుగా గెలవాలి. అదే అంతిమ లక్ష్యమని అన్నాడు. నేనే కాదు ఎవరైనా సరే, సెంచరీ చేస్తే ఆనందమే, కాదనను, కాకపోతే జట్టు గెలిచినప్పుడే కదా, అసలైన మజా అన్నాడు. అయినా రికార్డులు ఎప్పుడూ శాశ్వతం కాదని అన్నాడు.


ఈ సెంచరీలతో ఇప్పుడు నేను చాలామందిని దాటి వచ్చాను. నిన్నటి వరకు వారు ముందున్నారు. ఇప్పుడు నా రికార్డ్ వచ్చింది. రేపు మరొకటి రాదని గ్యారంటీ ఉందా? అని ప్రశ్నించాడు. అందుకని రికార్డుల కోసం కాదు.. దేశం కోసం, జట్టు విజయం కోసమే ఆడాలని అన్నాడు.

ఈ క్రమంలోనే సచిన్ రికార్డ్‌ను అధిగమిస్తావా? అన్న ప్రశ్నకు జో రూట్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘సచిన్ అత్యధిక పరుగుల టెస్ట్ రికార్డును పట్టించుకోవడం లేదని చెప్పాడు.  నా ఆట నేను ఆడుతున్నా.. అంతవరకేనని అన్నాడు.

ఇకపోతే 34 ఏళ్లకి దగ్గరలో ఉన్న జో రూట్.. మహా ఆడితే, మరో నాలుగేళ్లు ఆడవచ్చునని అంటున్నారు. మరి ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తాడా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నాలుగేళ్ల నుంచి ఆడుతున్నాడు. ఇంకో నాలుగేళ్లు ఇదే ఊపు, ఉత్సాహంతో ఆడాలి కదా..అప్పుడు చూద్దాంలే.. సచిన్ రికార్డ్ అని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. అంతవరకు ఊరికే గగ్గోలు పెట్టవద్దని చెబుతున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×