EPAPER

Umpire Anil Chaudhary: రోహిత్.. అందరూ అనుకునేంత సరదా మనిషి కాదు!

Umpire Anil Chaudhary: రోహిత్.. అందరూ అనుకునేంత సరదా మనిషి కాదు!

Umpire Anil Chaudhary About Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లో ఉన్నాడంటే.. చాలామంది కళ్లు తిప్పకుండా టీవీలవైపే చూస్తుంటారు. తను అవుట్ అయితే చాలామంది టీవీ చూడటం మానేసి సొంత పనుల్లో బిజీ అయిపోతుంటారు. అంతగా క్రికెట్ అభిమానులను అలరించే క్రికెటర్లలో రోహిత్ శర్మ ఒకరని చెప్పాలి. అలాంటి క్రికెటర్ పై ఒక అంపైర్ అన్న మాటలు నేడు నెట్టింట వైరల్ అయ్యాయి.


విషయం ఏమిటంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్యానెల్ అంపైర్లలో ఒకరైన అనిల్ చౌదురీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పోడ్ కాస్ట్ తో షేర్ చేసుకున్నాడు. అందులో రోహిత్ శర్మ గురించి మాట్లాడుతూ తను చాలా తెలివైన క్రికెటర్ అని, అతడికి క్రికెట్ ఐక్యూ ఎక్కువని తెలిపాడు. ప్రత్యర్థి బౌలర్140 కిమీ వేగంతో బాల్ వేస్తుంటాడు. తనేమీ అదరడు, బెదరడు, చాలా కూల్ గా ఉంటాడు. ఎందుకంటే బాల్ రిలీజ్ కాకుండానే చేయి తిప్పే వేగాన్ని బట్టి, అతనే బాల్ వేస్తున్నాడనేది గ్రహిస్తాడు. క్షణంలో వెయ్యో వంతులో ఫుట్ వర్క్ తో షాట్ కొట్టేందుకు రెడీగా ఉంటాడని అన్నాడు.

నేనీ విషయాన్ని చాలా సందర్భాల్లో దగ్గరుండి చూశానని అన్నాడు. చాలామంది బాల్ పిచ్ అయిన తర్వాత పొజిషన్ లోకి వస్తుంటారు. కానీ క్రికెట్ పై ఎంతో అనుభవం ఉంటే తప్ప, రోహిత్ లా ఆడటం కుదరదని అన్నాడు. తను ఏదైతే అంచనా వేశాడో, అదే బాల్ బౌలర్ నుంచి వస్తుందని తెలిపాడు. ఒకొక్కసారి పొరపాట్లు జరుగుతుంటాయి. అప్పుడే తను అవుట్ అయిపోతూ ఉంటాడని అన్నాడు.


Also Read: టీమిండియా పాక్ రావాలంటే ఆ భరోసా ఇస్తారా?: హర్భజన్ సింగ్

రోహిత్ అప్పీల్స్ విషయంలో అంపైర్లకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తాడని తెలిపాడు. మేం ఎప్పుడైనా కన్ ఫ్యూజన్ లో ఉంటే, తనే ముందుకొచ్చి… అవుట్ అని అనుకుంటున్నానని సిగ్నల్ ఇస్తాడు. దాంతో మా పని ఈజీ అవుతుందని తెలిపాడు. అయితే రోహిత్ పైకి ఎంతో సరదాగా కనిపిస్తాడు.. కానీ, అది క్రీజు బయట మాత్రమే…క్రీజులోకి వచ్చాక చాలా లోతైన మనిషి…తనని అంచనా వేయడం అంత ఈజీకాదని అన్నాడు.

గ్రౌండ్ లో జోక్స్ వేసినట్టుగా, నవ్వుతున్నట్టు ఉంటాడు కానీ, అది కూడా ఆటలో భాగమేనని అన్నాడు. ఎందుకంటే వాతావరణాన్ని తేలిక పరచడానికి, టీమ్ నిరాశలో పడిపోకుండా, ఓటమిని ఒప్పుకోకుండా చూడటంలో తనని మించిన వారు లేరని అన్నాడు. అతడు చాలా స్మార్ట్ అని తెలిపాడు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×