EPAPER

Harbhajan Singh: టీమిండియా పాక్ రావాలంటే ఆ భరోసా ఇస్తారా?: హర్భజన్ సింగ్

Harbhajan Singh: టీమిండియా పాక్ రావాలంటే ఆ భరోసా ఇస్తారా?: హర్భజన్ సింగ్

Harbhajan Singh Demand Full assurance of safety Team India: ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా దాయాది దేశం పాకిస్తాన్‌కు వెళ్లాలంటే భద్రతపై పూర్తి భరోసా ఇవ్వాలని టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఆటగాళ్ల భద్రత చాలా ముఖ్యమని చెప్పాడు.


ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తాము పాకిస్తాన్‌కు వెళ్లలేమని, తమ మ్యాచ్‌లను తటస్థ వేదికలలో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఐసీసీ కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి అదనపు బడ్జెట్ కేటాయించింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం పాకిస్తాన్ పర్యటనకు భారత్ రావాలని అంటోంది.

ఇరు దేశాల మధ్య నెలకొన్ని రాజకీయ విభేదాల కారణంగా పాకిస్తాన్ వెళ్లేందుకు టీమిండియాకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది.


అయితే టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్ లేదా శ్రీలకంలో నిర్వహించే అవకాశం ఉంది. కాగా, 2008 నుంచి టీమిండియా పాకిస్తాన్ లో పర్యటించడం లేదు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికేటర్ హర్భజన్ సింగ్ భద్రత చాలా ముఖ్యమని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా, 1996 వన్డే ప్రపంచకప్ తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుండటం ఇదే తొలిసారి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×