EPAPER

Chiranjeevi: బాలయ్య ఫంక్షన్‌లో ‘మెగా’ స్పీచ్.. ఇంద్ర సినిమాకు ఇన్‌స్పిరేషన్ ఇదేనంటా!

Chiranjeevi: బాలయ్య ఫంక్షన్‌లో ‘మెగా’ స్పీచ్.. ఇంద్ర సినిమాకు ఇన్‌స్పిరేషన్ ఇదేనంటా!

NBK 50: హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన బాలయ్య బాబు 50 సంవత్సరాలు వేడుకలో మెగాస్టార్ చిరంజీవి నిజంగానే మెగా స్పీచ్ ఇచ్చారు. ఫ్యాన్స్ గొడవలు పెట్టుకోవడం సరికాదని, తమ మధ్య సంబంధాలు ఉంటాయని వివరించారు. ఫ్యాన్స్ గొడవలు పెట్టుకుంటున్నారనే ఆలోచనతో.. హీరోల మధ్య మంచి సంబంధాలు ఉంటాయనే విషయాన్ని తెలయజేయడానికి కొన్ని ఫంక్షన్స్ చేసుకునేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. అందుకే తమ ఫ్యాన్స్ కలిసి ఉంటారన్నారు. తమ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బాలయ్య బాబు తప్పకుండా వస్తారని, కలిసి డ్యాన్స్ కూడా చేస్తారని వివరించారు. ఇప్పటికీ ఫ్యాన్స్ వార్ జరుగుతున్నాయి. అదీ చిరంజీవి నోట ఇలాంటి మాట రావడం నేటి సందర్భానికి అవసరం అని చర్చిస్తున్నారు.


ఇక బాలయ్య బాబు గురించి మాట్లాడుతూ.. ఈ వేడుకలో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉన్నదని, ఇది బాలయ్యకు చెందిన ఫంక్షన్‌గా చూడటం లేదని, మొత్తం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన వేడుకగా భావిస్తున్నానని వివరించారు. ఈ అరుదైన రికార్డును బాలకృష్ణ సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఎన్టీఆర్ వారసుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకతను చాటుకోవడం గొప్ప విషయమన్నారు. తాను ఇంద్ర సినిమా చేయడానికి ఇన్‌స్పిరేషన్ బాలకృష్ణ చేసిన సమర సింహారెడ్డి సినిమా అని వివరించారు. బాలయ్యతో కలిసి ఒక ఫాక్షన్ సినిమా చేయాలనేది తన కోరిక అని తెలిపారు. బాలయ్యకు భగవంతుడు ఇదే ఎనర్జీ ఇస్తూ 100 ఏళ్లు బావుండాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. రాజకీయ, వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యత్ అని ప్రశంసలు కురిపించారు. తామంతా ఒకే కుటుంబం లాంటివాళ్లమని, ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పి ప్రసంగాన్ని ముగించారు.

ఇక కమల్ హాసన్ సందేశాన్ని వీడియోలో చూపించారు. బాలయ్య బాబుకు తండ్రి, దైవం, గురువు ఒక్కరే అని, ఆయన తండ్రి ఎన్టీఆర్ గారని వివరించారు. బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు, స్వేచ్ఛగా ఉండే తత్వమని పేర్కొన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యం, ఐశ్వర్యంతో బావుండాలన్నారు.


Also Read: Jai Balayya: గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్.. సందడే.. సందడి

ఒక సినిమా 500 రోజులకుపైగా ఆడటం మాటలు కాదని, ఆ ఘనత బాలయ్య బాబుకే దక్కుతుందని మంచు మోహన్ బాబు కితాబిచ్చారు. మూడు సార్లు హిందూపూర్‌లో ఎమ్మెల్యేగా ఎన్నికకావడం ఆనందదాయకమని, చిన్నతనం నుండి విభిన్న, విశిష్ట నటుడు బాలయ్య అని వివరించారు.

బాలయ్యబాబుకు తాను తమ్ముడిలాంటివాడినని శివ రాజ్ కుమార్ అన్నారు. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో నటించినందుకు తనకు సంతోషంగా ఉన్నదని, ఆయన ఇలాగే 100 ఏళ్ల వేడుకలు చేసుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చి తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని, ఆయనకంటూ ఒక ప్రత్యేకతను ముద్రవేసుకున్నారని విక్టరీ వెంకటేష్ అన్నారు. 50 సంవత్సరాల బాలయ్యబాబు ప్రయాణం ఎంతో మందికి ఆదర్శమని చెప్పారు. ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదని పంచ్ డైలాగ్‌ పేల్చి హుషారు పెంచారు. ఇంకా పలువురు ప్రముఖులు బాలయ్య బాబును ప్రశంసల్లో ముంచెత్తారు.

Related News

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Big Stories

×