ఆగస్టులో నెలలో వసూలైన జీఎస్టీ వివరాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు!

ఆగస్టు నెలలో వసూలైన జీఎస్టీ వివరాలను కేంద్రం తాజాగా వెల్లడించింది.

ఆగస్టు నెలలో ₹1.75 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్రం పేర్కొన్నది.

మొత్తంగా 10% వృద్ధి నమోదైనట్లు తెలిపింది.

ఈ ఏడాది ఇప్పటి వరకు ₹9.13 లక్షల కోట్లు వచ్చినట్లు పేర్కొంది.

డొమెస్టిక్ రెవెన్యూ 9.2% వృద్ధితో ₹1.25 లక్షల కోట్లు వచ్చినట్లు తెలిపింది.

దిగుమతుల ద్వారా 12.1% వృద్ధితో ₹49,976 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది.

కాగా, గతేడాది ఆగస్టులో ₹1.59 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లైన విషయం తెలిసిందే.