EPAPER

Foot Ball: హైదరాబాద్‌లో ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ కప్‌కు సర్వం సిద్ధం

Foot Ball: హైదరాబాద్‌లో ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ కప్‌కు సర్వం సిద్ధం

– ఏర్పాట్లు పూర్తి చేసిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ
– ఫుట్ బాల్‌కు పునర్ వైభవం కోసం టోర్నమెంట్


స్వేచ్ఛ స్పెషల్ ఫోకస్

Soccer: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ సమన్వయంతో ఇంటర్‌ కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్ 2024కు అంతా సిద్ధమైంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో 3 దేశాలతో ఈ టోర్నమెంట్ జరగనుంది. మంగళవారం ఇండియా, మారిషస్ తలపడతాయి. 6న మారిషస్, సిరియా ఢీకొంటాయి. అలాగే, 9న ఇండియా, సిరియా మధ్య పోటీ ఉంటుంది.


తెలంగాణలో ఫుట్‌బాల్ క్రీడకు పునర్ వైభవం తీసుకురావడం కోసం ఈ ఇంటర్‌ కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్ 2024 ప్రధాన లక్ష్యమని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తెలిపింది. భారత జట్టుకు నాయకత్వం వహించిన అనేక మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లను హైదరాబాద్ నగరం అందించిందని చెప్పింది. ఇంటర్‌ కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్ 2024 సజావుగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించింది.

జీఎంసీ బాలయోగి స్టేడియం అవసరమైన ఆధునీకరణ పనులు చేపట్టామని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తెలిపారు. ఫుట్‌బాల్ పిచ్ అంతర్జాతీయ ప్రమాణాలకు పునరుద్ధరించబడిందని, ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేయబడిన సౌకర్యవంతమైన బకెట్ సీట్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. అతిథులు, ఆటగాళ్ల కొరకు గదులు సిద్ధం చేయడం జరిగిందని పెయింటింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనులు అన్నీ పూర్తి అయ్యాయని స్పోర్ట్స్ అథారిటీ అధికారులు తెలిపారు

Also Read: Kalki 2898 AD: కల్కి డిలిటెడ్ సీన్స్.. డిలీట్ చేయడమే బెటర్ అన్నట్టు ఉన్నాయే

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పోలీసు శాఖ సమన్వయంతో అన్ని భద్రతా చర్యలు తీసుకుంది. ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ వివిధ ప్రచార ప్రసార మద్యమాల ద్వారా విస్తృత ప్రచారానికి ఏర్పాట్లు చేస్తోంది. నగరంలోని ఫుట్‌బాల్ క్రీడాకారులు ప్రేమికులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావడానికి తగిన ఏర్పాట్లు చేశారు. దీని కోసం స్పోర్ట్స్ అథారిటీ యొక్క కోచ్‌లు, సిబ్బందితో అంతర్గత కమిటీలను వేసి ప్లేయర్లకు సాంకేతిక సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తోంది.

ఫుట్‌బాల్ టోర్నమెంట్ షెట్యూల్

సెప్టెంబర్ 3 – ఇండియా Vs మారిషస్
సెప్టెంబర్ 6 – మారిషస్ Vs సిరియా
సెప్టెంబర్ 9 – ఇండియా Vs సిరియా

వేదిక
జీఎంసీ బాలయోగి స్టేడియం
గచ్చిబౌలి, హైదరాబాద్

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×