EPAPER

Skin Care Tips: వీటిని ఫేస్‌పై నేరుగా అప్లై చేస్తే.. ఉన్న అందం కాస్త పాడవుతుంది

Skin Care Tips: వీటిని ఫేస్‌పై నేరుగా అప్లై చేస్తే.. ఉన్న అందం కాస్త పాడవుతుంది

Skin Care Tips : ముఖం అందంగా కనిపించడం కోసం చాలా మంది రకరకాల ఫేస్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వీటిని అనేక రసాయన పదార్థాలతో తయారుచేస్తారు. వీటి వల్ల ఫేస్‌కి కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ఇది ఇలా ఉంటే కొంత మంది అందంగా కనిపించడం కోసం హోం రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటారు. వీటివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కానీ కొన్ని రకాల పదార్థాలను ముఖంపై నేరుగా అప్లై చేయకపోవడం మంచిది. వీటిని ముఖంపై ఉపయోగించడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. అందాన్ని పాడు చేసే పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


నిమ్మరసం:
చాలా మంది తక్షణ మెరుపు కోసం నిమ్మరసాన్ని ముఖానికి నేరుగా అప్లై చేస్తూ ఉంటారు. ఇలా అప్లై చేయడం అంత మంచిది కాదు. ఫేస్‌కి వీటి వల్ల ఎంతో హాని కలుగుతుంది. చర్మానికి నిమ్మ రసాన్ని పూయడం వల్ల ముఖం ఎర్రగా మారుతుందని ఓ పరిశోధనలో కూడా రుజువయింది. నిమ్మ రసం వల్ల ముఖంపై దద్దర్లు, అలర్జీలు కూడా వస్తాయి. మరేదైనా పదార్థంతో నిమ్మరసాన్ని కలిపి ఫేస్‌పై అప్లై చేసుకుంటే.. పర్లేదు కానీ ముఖానికి నేరుగా నిమ్మరసాన్ని అప్లై చేసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఆవాల నూనె:
పురాతన కాలం నుంచి శరీరానికి, ముఖానికి ఆవాల నూనెను చాలా మంది వాడుతుంటారు. ఆవాల నూనే వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ దీంతో కలిగే ప్రయోజనాల కంటే ప్రతికూలతలే ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్కరి చర్మం ఒక్కొ రకంగా ఉంటుంది. కనుక ముఖానికి ఆవాల నూనె అప్లై చేస్తే చర్మం నల్లగా మారే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా మొటిమలు, మచ్చలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆవాలను మనం ముఖంపై మీకు నేరుగా అప్లై చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


వెల్లుల్లి:
చర్మ సంబంధిత సమస్యలకు వంటగదిలోని కొన్ని వస్తువులను ఉపయోగించవచ్చు. కానీ నేరుగా వెల్లుల్లిని ముఖంపై ఉపయోగిస్తే దద్దుర్లు, ఎలర్జీ, వాపులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వెల్లుల్లిని నేరుగా ముఖానికి అప్లై చేయకూడదు. దీనివల్ల ముఖం రంగు మారే అవకాశం ఉంటుంది.

 ఉప్పు వాడకం:
మిగిలిన శరీర భాగాలపై ఉండే చర్మం కంటే ముఖంపై చర్మం సున్నితంగా ఉంటుంది. దీనిపై ఉప్పు నేరుగా ఉపయోగించడం చాలా హానికరం. ఉప్పుతో స్క్రబ్ చేయడం లేదా ఉప్పు నీటిని ముఖానికి ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారుతుంది. దీనివల్ల ముఖంపై చుండ్రు, దురద సమస్యలు కూడా పెరుగుతాయి. అందుకే ముఖానికి ఉప్పును వాడకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: అందంగా కనిపించాలా..? అయితే ఈ ఫేస్ ప్యాక్స్ మీ కోసమే !

బేకింగ్ సోడా:
వంటల్లో బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కానీ దీనిని నేరుగి చర్మంపై ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బేకింగ్ సోడా ముఖంపై అప్లై చేయడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చల సమస్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా ముఖంపై ఎర్రటి దద్దుర్లు కూడా వస్తాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×